SBI ఖాతాదారులకు అలెర్ట్‌.. ఆ సేవలకు అంతరాయం

ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఎస్‌బీఐ డిజిటల్‌ సేవలకు అంతరాయం కలగనుంది. బ్యాంకుకు సంబంధించి నిర్వహణ పనుల నేపథ్యంలో బ్యాంకు డిజిటల్‌ చెల్లింపుల వేదికలైన ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, యోనో, యూపీఐ తదితర....

Published : 21 May 2021 00:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఎస్‌బీఐ డిజిటల్‌ సేవలకు అంతరాయం కలగనుంది. బ్యాంకుకు సంబంధించి నిర్వహణ పనుల నేపథ్యంలో బ్యాంకు డిజిటల్‌ చెల్లింపుల వేదికలైన ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, యోనో, యూపీఐ తదితర సేవలు 3 రోజుల పాటు పరిమిత సయమంలో నిలిచిపోనున్నాయి. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడంలో ఆయా సేవల్లో శుక్రవారం నుంచి ఆదివారం మధ్య అప్‌గ్రేడేషన్‌ ప్రక్రియ చేపడుతోంది. దీంతో శుక్రవారం రాత్రి 10 గంటల 45 నిమిషాల నుంచి రెండున్నర గంటల పాటు, ఆదివారం తెల్లవారుజామున 2 గంటల 40 నిమిషాల నుంచి 06 గంటల 10 నిమిషాల వరకు డిజిటల్‌ సేవల్లో అంతరాయం ఏర్పడుతుందని బ్యాంకు తెలిపింది. తమకు సహకరించాలని ఖాతాదారులకు విజ్ఞప్తి చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని