ఉత్తరాంధ్ర వాసులకు గుడ్‌న్యూస్.. విశాఖ నుంచి నేరుగా వారణాసికి రైలు
ఉత్తరాంధ్ర వాసుల ఏళ్ల కళ ఎట్టకేలకు నెరవేరింది. విశాఖ నుంచి వారణాసి నేరుగా ప్రయాణించేందుకు రైలు అందుబాటులోకి రానుంది. ఇందుకు రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరాంధ్ర వాసులకు రైల్వే శాఖ (Indian Railways) గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకపై నేరుగా వారణాసికి వెళ్లేందుకు వీలుగా సంబల్‌పూర్ నుంచి బనారస్ మధ్య నడిచే (18311) ఎక్స్‌ప్రెస్ రైలును విశాఖ వరకు పొడిగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu) ఈ విషయాన్ని ఎక్స్ (ట్విటర్) వేదికగా తెలియజేశారు. ఉత్తరాంధ్ర వాసుల కల నెరవేర్చినందుకు రైల్వే శాఖకు ధన్యవాదాలు తెలిపారు.
ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి: రాష్ట్రపతిని కోరిన లోకేశ్
ప్రస్తుతం ఉత్తరాంధ్ర వాసులు వారణాసి వెళ్లాలంటే విజయవాడ లేదా భువనేశ్వర్ వెళ్లి రైలు ఎక్కాల్సి ఉంటుంది. కాశీ విశ్వనాథుడిని దర్శించుకోవాలన్నా, కర్మకాండలకు సంబంధించిన కార్యక్రమాలకు హాజరవ్వాలన్నా ఎన్నో వ్యయప్రయాసలు కోర్చాల్సిన పరిస్థితి. దీంతో ఎన్నో ఏళ్లు నుంచి వారణాసికి రైలు నడపాలని ఉత్తరాంధ్ర వాసులు కోరుతున్నారు. తాను లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికైనప్పటి నుంచి ఇదే విషయాన్ని పలుమార్లు పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తడంతో పాటు రైల్వే శాఖ దృష్టికి తీసుకెళ్లానని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఉత్తరాంధ్ర వాసుల వినతిని పరిగణనలోకి తీసుకున్న రైల్వే శాఖ రైలు పొడిగింపునకు ఆమోదం తెలిపిందని చెప్పారు. వారానికి రెండు రోజుల పాటు (బుధ, శని) ఒడిశాలోని సంబల్‌పూర్ నుంచి ప్రారంభమయ్యే ఈ రైలు.. ఇకపై విశాఖ నుంచి త్వరలో అందుబాటులోకి రానుంది. విశాఖ, కొత్తవలస, విజయనగరం, బొబ్బిలి, సంబల్‌పూర్ స్టేషన్ల మీదుగా వారణాసికి చేరుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Nagarjuna sagar: నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత
నాగార్జునసాగర్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఏపీ పోలీసులు అర్ధరాత్రి నాగార్జున సాగర్ వద్దకు చేరుకొని ఎస్పీఎఫ్ పోలీసులపై దాడి చేశారు. డ్యామ్‌పై విద్యుత్ సరఫరా నిలిపివేసి, అక్కడి సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. -
హైదరాబాద్ ఓటర్ల కోసం ‘పోల్ క్యూ రూట్’ పోర్టల్
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలనే ఉద్దేశంతో హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ కొత్త పోర్టల్‌ను ఓటర్లకు అందుబాటులోకి తీసుకొచ్చారు. -
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/11/23)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించే నేటి రాశి ఫలాల వివరాలు.