Alert: 17 రైళ్లు రద్దు.. ఇంకొన్ని ప్రధాన రైళ్లు భారీ ఆలస్యం
సికింద్రాబాద్ నుంచి శని, ఆదివారాల్లో ఇతర ప్రాంతాలకు రాకపోకలు కొనసాగించే 17 రైళ్లు రద్దు కాగా.. మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.
హైదరాబాద్: సికింద్రాబాద్(Secunderabad) నుంచి ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగించే రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక. ఈనెల 20, 21 తేదీల్లో 17 రైళ్లు రద్దు కాగా.. ఇంకొన్ని ప్రధాన రైళ్ల సర్వీసులు ఆలస్యంగా నడవనున్నాయి. ఆయా రైళ్లకు సంబంధించిన వివరాలను దక్షిణ మధ్య రైల్వే(South Central railway) గురువారం రాత్రి ఓ ప్రకటనలో వెల్లడించింది. సికింద్రాబాద్ డివిజన్‌లోని ఘట్‌కేసర్- చర్లపల్లి స్టేషన్ల మధ్య చర్లపల్లి కోచింగ్ టెర్మినల్ నిర్మాణంలో భాగంగా ఆర్‌యూబీ పనుల దృష్ట్యా పలు రైళ్లను రద్దు/రీషెడ్యూల్ చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.
ఆదివారం రద్దయిన 17 రైళ్లు ఇవే..
ఈ నెల 21న (ఆదివారం) వరంగల్ -సికింద్రాబాద్ (రైలు నంబర్ 07757); సికింద్రాబాద్ -వరంగల్ (07462); వరంగల్ - హైదరాబాద్ (07463); హైదరాబాద్- కాజీపేట(07758); కాచిగూడ -మిర్యాలగూడ (07276); మిర్యాలగూడ-నడికుడి(07277); నడికుడి-మిర్యాలగూడ (07973); మిర్యాలగూడ-కాచిగూడ(07974); సికింద్రాబాద్- రేపల్లె(17645); గుంటూరు-వికారాబాద్(12747); వికారాబాద్-గుంటూరు(12748); హైదరాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్(17011); సిర్పూర్ కాగజ్‌నగర్- హైదరాబాద్(17012); సిర్పూర్ కాగజ్‌నగర్ - సికింద్రాబాద్ (17234); సికింద్రాబాద్- గుంటూరు (17202); గుంటూరు- సికింద్రాబాద్ (17201); సికింద్రాబాద్- సిర్పూర్ కాగజ్‌నగర్ (17233) రైళ్లు రద్దయినట్టు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్. రాకేశ్ వెల్లడించారు.
ఈ రైళ్లు ఆలస్యం
ఈ నెల 20న కొన్ని ప్రధాన రైళ్లు గంట నుంచి 3 గంటల పాటు ఆలస్యంగా నడవనున్నాయి. హావ్‌డా- సికింద్రాబాద్( రైలు నంబర్ 12703) మూడు గంటల పాటు ఆలస్యంగా బయల్దేరనుంది. శనివారం ఉదయం 8.35గంటలకు బయల్దేరాల్సిన ఈ రైలును ఉదయం 11.35గంటలకు రీషెడ్యూల్ చేశారు. అలాగే, భువనేశ్వర్-ముంబయి సీఎస్‌ఎంటీ(11020) రైలు కూడా మూడు గంటల ఆలస్యంగా నడవనుంది. సాధారణంగా మధ్యాహ్నం 3.20గంటలకు బయల్దేరాల్సిన ఈ రైలు సాయంత్రం 6.20గంటలకు బయల్దేరనుంది. త్రివేండ్రం-సికింద్రాబాద్ (17229) రైలు 2 గంటలు ఆలస్యం కానుంది. ఉదయం 6.45గంటలకు బయల్దేరే ఈ రైలు శనివారం (మే 20న) ఉదయం 8.45గంటలకు బయల్దేరుతుంది. రాత్రి 11.20గంటలకు బయల్దేరాల్సిన విశాఖపట్నం-ముంబయి ఎల్‌టీటీ (18519) రైలు గంట ఆలస్యంగా అర్ధరాత్రి 12.20 నిమిషాలకు బయల్దేరుతుంది. మే 21 (ఆదివారం) రోజు సాయంత్రం 6.50గంటలకు బయల్దేరాల్సిన సికింద్రాబాద్ -మన్మాడ్ (17064) రైలు 3 గంటలు ఆలస్యంగా రాత్రి 9.50గంటలకు బయల్దేరనుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
PM Modi: ‘నా ప్రతి నిర్ణయం.. మీ కోసమే’: మోదీ
-
Sports News
CSK vs GT: సీఎస్కేకు ఐదో టైటిల్.. ఈ సీజన్లో రికార్డులు ఇవే!
-
Crime News
Kodada: డాక్టర్ రాలేదని కాన్పు చేసిన నర్సులు.. వికటించి శిశువు మృతి
-
Crime News
TSPSC Paper Leak: చాట్ జీపీటీతో జవాబులు.. ఎలక్ట్రానిక్ డివైస్‌తో చేరవేత!
-
Sports News
MS Dhoni: ‘కెప్టెన్ కూల్’ మరో ఘనత.. ఐపీఎల్లో తొలి క్రికెటర్‌గా ధోనీ రికార్డు
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు