
Akhanda: సీటు బెల్టుపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల వినూత్న ప్రచారం
హైదరాబాద్: ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు తరచూ చెబుతుంటారు. రహదారులపై హోర్డింగ్‌లు ఏర్పాటు చేయడం, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు నిబంధనలు పాటించని వాళ్లపై జరిమానాలు విధిస్తున్నారు. వాహనదారులకు సులభంగా అర్థమయ్యేలా... వాళ్లను ఆకర్షించేలా ఉండేందుకు ట్రాఫిక్ పోలీసులు పలు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రాఫిక్ నిబంధనలతో పోలుస్తూ సామాజిక మాధ్యమాల్లో ఉంచుతున్నారు. అలాంటి సన్నివేశం ఒకటి... హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రచారం చేస్తున్నారు. ఇటీవల ఘన విజయం సాధించిన ‘అఖండ’ చిత్రంలోని ఓ దృశ్యాన్ని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తమ ఫేస్‌బుక్, ట్విటర్, యూట్యూబ్ ఖాతాల్లో అప్‌లోడ్ చేశారు. హీరో బాలకృష్ణ, హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కలిసి వాహనంలో వెళ్తున్న సందర్భంలో చోటు చేసుకున్న సన్నివేశాన్ని ట్రాఫిక్ పోలీసులు ప్రచారం చేస్తున్నారు.