రేషన్‌ వాహనాలను పరిశీలించిన ఎస్‌ఈసీ

ఆంధ్రప్రదేశ్‌లో రేషన్‌ డెలివరీ వాహనాలను బుధవారం ఉదయం ఎస్‌ఈసీ రమేశ్‌ కుమార్‌ తనిఖీ చేశారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు విజయవాడ ఎస్‌ఈసీ కార్యాలయానికి..

Updated : 03 Feb 2021 12:23 IST

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో రేషన్‌ డెలివరీ వాహనాలను బుధవారం ఉదయం ఎస్‌ఈసీ రమేశ్‌ కుమార్‌ తనిఖీ చేశారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు విజయవాడ ఎస్‌ఈసీ కార్యాలయానికి ఈ వాహనాలను పౌర సరఫరాల శాఖ అధికారులు తీసుకొచ్చారు. వాహనాలపై ఉన్న రంగులను, ఫొటోలను ఎస్‌ఈసీ పరిశీలించారు. వాహనంలోని సదుపాయాలను అధికారులు ఎస్‌ఈసీకి వివరించారు.

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఇంటింటికీ రేషన్‌ అందించే వాహనాలపై రాజకీయ నేతల ఫొటోలు, పార్టీ గుర్తులు ఉండరాదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం గతంలో ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఇంటింటికీ రేషన్‌ పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున పంపిణీకి అనుమతి కోరుతూ ప్రభుత్వం హైకోర్టులో హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఎన్నికల నిబంధనలకు లోబడే రేషన్‌ వాహనాల ద్వారా పంపిణీ కార్యక్రమం చేపట్టాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. కార్యక్రమ వివరాలతో ఎస్‌ఈసీని సంప్రదించాలని తెలిపింది.

ఇవీ చదవండి..
రేషన్‌ వాహనాలపై పార్టీ గుర్తులు వద్దు:హైకోర్టు

107 పల్లెలకు ఇవే చివరి పంచాయతీ ఎన్నికలా..?


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని