Vande Bharat: సికింద్రాబాద్ - తిరుపతి ‘వందేభారత్’.. ప్రారంభోత్సవం రోజున ఆగే స్టేషన్లు ఇవే!
తెలుగు రాష్ట్రాల మధ్య రెండో వందేభారత్ రైలు పరుగు పెట్టనుంది. ఈ నెల 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ఈ రైలును ప్రారంభించనున్నారు.
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య రెండో వందేభారత్ రైలు పరుగు పెట్టనుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 8వ తేదీన సికింద్రాబాద్ నుంచి ఈ రైలును ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. సికింద్రాబాద్-తిరుపతి మధ్యన నడిచే ఈ రైలు గమ్యస్థానాన్ని చేరుకోవటానికి కేవలం 8.30 గంటల సమయం పడుతుందని చెప్పారు. హైదరాబాద్ నుంచి ఆధ్యాత్మిక నగరం తిరుపతిని సందర్శించుకోవాలనుకునే వారికి అనుకూలంగా వందే భారత్ సేవలు అందిస్తుందని తెలిపారు.
ఇవీ చదవండి: 8.30 గంటల్లో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి.. వందేభారత్ టైమింగ్స్ ఇలా...
నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో ఈ రైలు ఆగుతుందని చెప్పారు. ప్రారంభోత్సవం రోజున నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు స్టేషన్లలో వందేభారత్ రైలు ఆగతుందని... అన్ని స్టేషన్లలో స్థానిక ప్రజలు ఘనంగా స్వాగతం పలకాలని కిషన్‌రెడ్డి కోరారు. కాగా.. ఏప్రిల్ 8న సికింద్రాబాద్‌లో రైలును ప్రారంభిస్తున్నప్పటికీ ఆ రోజు ప్రయాణికులను అనుమతించబోరు. ఆ రోజు సికింద్రాబాద్‌లో 11.30 గంటలకు ప్రారంభమై తిరుపతి 21.00 గంటలకు చేరుతుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
కోర్టు బోనెక్కనున్న బ్రిటన్ రాకుమారుడు..
-
Ap-top-news News
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం.. 18 దూరప్రాంత రైళ్ల రద్దు
-
India News
అరిహాను స్వదేశానికి పంపండి.. మూడేళ్ల పాప కోసం జర్మనీపై భారత్ ఒత్తిడి
-
India News
పెద్దమనసు చాటుకున్న దీదీ
-
Crime News
పెద్ద నోట్లకు ఆశపడితే ఉన్న నోట్లు జారిపాయే!.. రాజానగరంలో సినీఫక్కీలో రూ. 50 లక్షల చోరీ
-
Ts-top-news News
రీజినల్ పాస్పోర్టు కార్యాలయంలో అదనపు కౌంటర్లు