Updated : 21 Jan 2021 09:54 IST

బైడెన్‌.. హారిస్‌ సీక్రెట్‌ కోడ్‌ పేర్లు‌ ఏంటంటే..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికా అధ్యక్ష పదవి అంటే అంత ఈజీ కాదు. అధికారంతోపాటు ఆపదలు ఎక్కువే ఉంటాయి. అందుకే సాధారణ భద్రతతోపాటు అధ్యక్షుడికి, ఆయన కుటుంబానికి.. అధ్యక్షుడితో కలిసి పనిచేసే ముఖ్యమైన వ్యక్తులకు ప్రభుత్వం రహస్య భద్రత కల్పిస్తుంటుంది. ఈ క్రమంలో భద్రతదళాలు వారిని అసలు పేర్లకు బదులు సీక్రెట్‌ సర్వీస్‌ కోడ్‌ పేర్లతో పిలుస్తుంటాయి. చాలాకాలంగా ఈ సీక్రెట్‌ సర్వీస్‌ కోడ్‌ అమల్లో ఉంది. తాజాగా అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్‌కు కూడా సీక్రెట్‌ సర్వీస్‌ కోడ్‌ పేర్లను కేటాయించారు. జో బైడెన్‌ను ‘సెల్టిక్’ అని, కమలా హ్యారీస్‌ను ‘పయోనీర్‌’ అని పిలవనున్నారు.

బరాక్‌ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రహస్య భద్రతదళాలు ఒబామాను రెనెగేడ్‌ అని, ఆయన సతీమణి మిచెల్‌ ఒబామాను రెనీసన్స్‌ అని పిలిచాయి. ఆ తర్వాత అధ్యక్షుడైన డొనాల్డ్‌ ట్రంప్‌ను మొగుల్‌ అని, ఆయన సతీమణి మెలినియా ట్రంప్‌ను మ్యూస్‌, కుమార్తె ఇవాంకను మార్వెల్‌, కుమారుడు ట్రంప్‌ జూనియర్‌ను మౌంటనీర్‌, ఎరిక్‌ ట్రంప్‌ను మార్స్‌మన్‌, అల్లుడు కుష్నర్‌ను మెకానిక్‌ అని పిలిచారు. ప్రస్తుతం అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన బైడెన్‌ మాత్రం బరాక్‌ ఒబామా హయాంలో ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు తనకు కేటాయించిన సెల్టిక్‌ పేరును, తన సతీమణి జిల్‌ బైడెన్‌కు కేటాయించిన కాప్రి పేరును ఇప్పుడూ కొనసాగించడానికి ఇష్టపడుతున్నారు. ఇక కమలా హారిస్‌.. వైట్‌హౌస్‌ అధికారులు సూచించిన సీక్రెట్‌ సర్వీస్‌ కోడ్‌ పేర్లలో ఉన్న ‘పయోనీర్‌’ను గత కొన్ని నెలల కిందటే ఎంచుకున్నారట. ఇప్పుడు ఆ పేరును ఖరారు చేశారు. త్వరలో అధ్యక్ష, ఉపాధ్యక్షుల కుటుంబసభ్యులకు కూడా సీక్రెట్‌ సర్వీస్‌ కోడ్‌ పేర్లను కేటాయించనున్నారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని