Revanth reddy: వర్షాకాలంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి: సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌ ప్రజలు వర్షాకాలంలో ఇబ్బందులు పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. 

Published : 15 Jun 2024 22:06 IST

హైదరాబాద్‌: హైదరాబాద్‌ ప్రజలు వర్షాకాలంలో ఇబ్బందులు పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ కేంద్రంలో సీఎం సమీక్ష నిర్వహించారు. వర్షాకాలంలో ఎలాంటి అత్యవసర పరిస్థితి ఏర్పడినా స్పందించేలా పటిష్ట చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. అవుటర్ రింగ్ రోడ్డు వరకు విపత్తు నిర్వహణ వ్యవస్థలను విస్తరించాలని చెప్పారు. ఓఆర్ఆర్ వరకు ఉన్న సీసీ కెమెరాలన్నింటినీ వీలైనంత త్వరగా కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానం చేయాలని ఆదేశించారు. 

వర్షాకాలంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు రేవంత్ రెడ్డి సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంతోపాటు.. ట్రాఫిక్ పోలీసులు ప్రత్యక్షంగా రోడ్లపై ఉండాలన్నారు. సిబ్బంది కొరత లేకుండా హోంగార్డుల నియామకం చేపట్టాలన్నారు. ఎఫ్ఎం రేడియో ద్వారా ట్రాఫిక్ అలర్ట్స్‌ ఇవ్వాలని చెప్పారు. హైదరాబాద్‌లో వరద తీవ్రత ఎక్కువగా ఉండే 141 ప్రాంతాలను గుర్తించి ఇప్పటికే ముందస్తు చర్యలు చేపట్టినట్లు సీఎంకు అధికారులు తెలిపారు. నీరు ఎక్కువగా చేరే ప్రాంతాల్లో హార్వెస్టింగ్ ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. కమాండ్ కంట్రోల్‌ను సీఎంతోపాటు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌లు సందర్శించి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని