Self Love: ఒంటరిగా ఫీల్‌ అవుతున్నారా! ఇలా చేయండి!

ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్న సమస్య ఒంటరితనం. ఈ ఒంటరితనాన్ని జయించడం ఎలా? జీవితాన్ని ఆనందంగా గడపటం ఎలా? అంటే.. అనేక మార్గాలున్నాయి. 

Updated : 27 Oct 2022 13:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్న సమస్య ఒంటరితనం. ఈ ఒంటరితనాన్ని జయించడం ఎలా? జీవితాన్ని ఆనందంగా గడపటం ఎలా? అంటే.. అనేక మార్గాలున్నాయి. 

మీ గురించి మీరు తెలుసుకోండి..
చాలామంది ఒంటరిగా ఉండడానికి ఇబ్బంది పడుతుంటారు. కానీ ఈ అవకాశాన్ని మీ గురించి మీరు తెలుసుకునేందుకు ఉపయోగించుకోండి. మీ ఆలోచనలను అక్షరీకరించండి. 

కొత్త విషయాలను నేర్చుకోండి..
తెలుసుకోవాలనే ఉత్సాహం ఉంటే సమయాన్ని సమర్థంగా ఉపయోగించుకోగలుగుతారు. ఒంటరిగా ఉన్నపుడు కొత్త విషయాలు తెలుసుకోండి. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఎన్నోరకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. నచ్చిన కోర్సులు చేయండి. 

ప్రయాణాలు చేయండి..

కొత్త ప్రదేశాలకు వెళ్లండి. దీంతో మనసుకు ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది. కొత్త ప్రాంతాలు, అక్కడి సంస్కృతి గురించి తెలుసుకోండి. 

కాసేపు సరదాగా..
ఉరుకుల పరుగుల జీవితంలో సరదాగా గడిపే సమయం ఉండటం లేదు. కానీ రోజులో కాసేపు సరదాగా ఉండేందుకు సమయం కేటాయించుకోండి. నచ్చిన పాటలు వినండి. కొంతమంది వంట చేసేందుకు ఇష్టపడుతారు. కొందరు పెయింటింగ్‌ వేస్తారు. ఇలా ఎవరికి నచ్చిన పనిని వాళ్లు చేసుకోవచ్చు. దీంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రతికూల వాతావరణం దరి చేరదు. 

ధ్యానం చేయండి..
ధ్యానం చేయడం వల్ల మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. ఆలోచనా శక్తి పెరుగుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని