Published : 07 Jul 2022 20:58 IST

MP Arvind: ఎంపీగా ఉన్న నాపైనే హత్యాయత్నం జరిగింది.. సీపీని తప్పించాలి: అర్వింద్‌

హైదరాబాద్‌: నిజామాబాద్‌కు గంజాయి విచ్చలవిడిగా సరఫరా అవుతోందని ఆ నియోజకవర్గ భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఆరోపణలు చేశారు. నిజామాబాద్‌లో శాంతిభద్రతలు క్షీణించాయని, ఉగ్రవాద కార్యాకలాపాలు ఎక్కువయ్యాయని పేర్కొన్నారు. సీపీ నాగరాజు శాంతి భద్రత పరిరక్షణలో వైఫల్యం చెందారన్నారు. నిజామాబాద్‌లో ప్రజాప్రతినిధులను హత్య చేసేందుకు సుపారీలు తీసుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఎంపీగా ఉన్న తనపైనే హత్యాయత్నం జరిగిందని ఫిర్యాదు చేసినా.. పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదన్నారు. 

పోలీసుల స‌హ‌కారంతోనే వంద‌లాది నకిలీ పాస్‌పోర్టులతో రోహింగ్యాలు ఇక్కడ చలామణి అవుతున్నారని చెప్పారు. ‘‘జగిత్యాలకు చెందిన వ్యక్తి నిజామాబాద్ వేదికగా ఉగ్రశిక్షణ ఇస్తున్నారు. ఈ క్యాంపులో ఏపీతో పాటు తెలంగాణ వచ్చిన వారు ఉన్నారు. ఇంత జరుగుతున్నా నిజామాబాద్ సీపీ నాగ‌రాజుకు ఎందుకు తెలియ‌డం లేదు? ఎంఐఎం, తెరాస పార్టీలే ఆయ‌న్ని క‌మిష‌నర్‌గా తీసుకువచ్చాయి. సీపీ నాగరాజును నిజామాబాద్ క‌మిష‌న‌ర్ స్థానం నుంచి వెంటనే త‌ప్పించాలి’’ అని డిమాండ్‌ చేశారు.  

మరోవైపు, రాష్ట్రంలో ప్రజాసమస్యలు, తెరాస వైఫల్యాలపై భాజపా అధ్యయన కమిటీ తొలిసారి సమావేశం అయిందని ఎంపీ అర్వింద్‌ వెల్లడించారు. తెరాస ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి వాటిని విస్మరించిందని చెప్పారు. మ‌రిన్ని స‌మావేశాలు నిర్వహించి ప్రజాసమస్యలను గుర్తిస్తామన్నారు. గ‌ల్లీ నుంచి రాష్ట్ర స్థాయి వ‌ర‌కు సమస్యలను గుర్తించి రాష్ట్ర నాయ‌క‌త్వానికి అంద‌జేస్తామని వెల్లడించారు. 

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని