CM Jagan: అండర్‌-19 భారత జట్టు వైస్‌ కెప్టెన్‌ రషీద్‌కు ఏపీ సీఎం వరాలు

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ను భారత క్రికెట్‌ అండర్‌ -19 జట్టు వైస్‌ కెప్టెన్‌ షేక్‌ రషీద్‌ కలిశారు. మంత్రి అవంతి శ్రీనివాస్‌తో కలిసి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి వచ్చిన  రషీద్‌ ..

Updated : 17 Feb 2022 03:30 IST

తాడేపల్లి:  ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ను భారత క్రికెట్‌ అండర్‌ -19 జట్టు వైస్‌ కెప్టెన్‌ షేక్‌ రషీద్‌ కలిశారు. మంత్రి అవంతి శ్రీనివాస్‌తో కలిసి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి వచ్చిన  రషీద్‌ .. సీఎంను కలిశారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చి అంతర్జాతీయ క్రికెట్‌లో రాణిస్తూ క్రికెట్‌ అభిమానులను ఆకట్టుకుంటున్న 17 ఏళ్ల రషీద్‌ను సీఎం జగన్‌ అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.10లక్షల నగదు బహుమతి అందించారు. గుంటూరులో నివాస స్థలం కేటాయించాలని, రషీద్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తికాగనే సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగం ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ తరఫున ప్రకటించిన రూ.10లక్షల చెక్‌ను సీఎం చేతుల మీదుగా అందజేశారు. షేక్‌ రషీద్‌ స్వస్థలం గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పాతమల్లాయపాలెం. టీమిండియా యువజట్టు ఆసియా కప్‌ గెలవడంలోనూ, అండర్‌-19 ప్రపంచకప్‌ ఐదోసారి కైవసం చేసుకోవడంలోనూ కీలకపాత్ర పోషించారు. హోం మంత్రి సుచరిత, రషీద్‌ తండ్రి బాలీషా, ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ సభ్యులు, శాప్‌ అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని