Samatha murthi: చరిత్రలో గుర్తుండిపోయేలా శాంతి కళ్యాణం: చినజీయర్‌ స్వామి

రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో 12 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగిన సమతామూర్తి సహస్రాబ్ది వేడుకలు పూర్తయ్యాయి. వేడుకల్లో చివరి

Published : 15 Feb 2022 01:44 IST

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో 12 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగిన సమతామూర్తి సహస్రాబ్ది వేడుకలు పూర్తయ్యాయి. వేడుకల్లో చివరి రోజున యాగశాలలో సహస్ర కుండలాల లక్ష్మీనారాయణ మహాయాగాన్ని 5 వేల మంది రుత్వికులు సుసంపన్నం చేశారు. మహాయజ్ఞం ఆవాహనంతో 1,035 పాలికల్లోని సంప్రోక్షణ జలాలతో సమతామూర్తి స్వర్ణ విగ్రహానికి చినజీయర్ స్వామి ప్రాణప్రతిష్ఠ చేశారు. అనంతరం ప్రవచన మండపంలో రుత్వికులతో చినజీయర్ స్వామి సమావేశమయ్యారు. ఇవాళ రాత్రి 108 ఆలయాల్లో నిర్వహించాల్సిన శాంతి కళ్యాణాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 19న అత్యంత వైభవంగా చరిత్రలో గుర్తిండిపోయే విధంగా శాంతి కళ్యాణం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సమతామూర్తి సంకల్పం ప్రారంభించినప్పటి నుంచి ఎంతో మంది భక్తుల సంపాదన రామానుజుల సమతామూర్తి కేంద్ర నిర్మాణంలో ఉందన్నారు. లక్షలాది మంది భక్తులు, వికాస తరంగిణి కార్యకర్తల సేవ, అర్చకుల వైదిక ప్రక్రియ సహస్రాబ్ది వేడుకలకు వన్నె తెచ్చాయని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహాయాగంలో భాగస్వాములైన రుత్వికులను చినజీయర్ స్వామి సన్మానించారు. ఈ నెల 19న జరిగే శాంతి కళ్యాణానికి అవకాశం ఉన్న రుత్వికులంతా రావాలని చినజీయర్ స్వామి విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని