Published : 03 Jan 2022 23:05 IST

Viral Video: వరి తవుడు నుంచి ఇలా చేయొచ్చని తెలుసా?

వీడియో షేర్‌ చేసిన ఎంపీ శశిథరూర్‌ 

ఇంటర్నెట్‌ డెస్క్‌: సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉండే  కాంగ్రెస్‌ నాయకుడు, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌ తాజాగా సరికొత్త విషయాన్ని ట్విటర్‌లో పంచుకున్నారు. వరితవుడు నుంచి తయారు చేసే పర్యావరణహితమైన కంటైనర్ల గురించి ఓ వీడియా రూపంలో పంచుకున్నారు. ‘‘ వరితవుడు నుంచి చేసిన ఈ ఫుడ్‌ కంటైనర్లు లీక్ ప్రూఫ్. అంతేకాదు అందరికీ అందుబాటు ధరల్లో లభిస్తాయి. కేవలం ఒక్కసారి మాత్రమే వినియోగించగలం. హోటల్స్‌, రెస్టారెంట్స్‌లో ప్యాకింగ్‌ నిమిత్తం ప్లాస్టిక్‌ వినియోగిస్తున్నారు. వాటిస్థానాల్లో ఈ సరికొత్త ఉత్పత్తులను ఉపయోగించాలి. దేశవ్యాప్తంగా అందరూ దీన్ని అనుసరించాలి’’ అంటూ ట్వీట్‌ చేశారు. తొలుత ఈ వీడియోను ఐఏఎస్‌ అధికారిణి సుప్రియా సాహూ ట్వీట్‌ చేయగా.. శశి థరూర్‌ దాన్ని రీట్వీట్‌ చేశారు. నెట్టింట ఈ వినూత్న ఆలోచనకు విశేష స్పందన వస్తోంది. వరితవుడు నుంచి తయారు చేసిన చిన్నసైజు కప్పులు, గ్లాసులు, కంటైనర్లు ఎక్కడ  దొరుకుతాయని నెటిజన్లు సుప్రియాను అడగగా.. పర్యావరణహిత కంటైనర్లను తయారుచేసే తయారీదారులను వివరాలను npcb.gov.in/pdf_2021/EcoAlternativeManufacturer301221.pdf ద్వారా సంప్రదించవచ్చన్నారు.



Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని