Shashi Tharoor: సింగర్‌గా మారిన ఎంపీ శశి థరూర్‌.. ఏం పాట పాడారంటే!

కాంగ్రెస్‌ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి శశథరూర్‌ తాజాగా గాయకుడి అవతారమెత్తారు. ఇదంతా ఏ సినిమా కోసమో కాదండోయ్. సోమవారం శ్రీనగర్‌లో జరిగిన ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి ప్రాతినిధ్యం వహించారాయన. ఈసందర్భంగా.. దూదర్శన్‌ శ్రీనగర్‌ ఏర్పాటు చేసిన కల్చర్‌ ఈవెంట్లో.. అలనాటి బాలీవుడ్‌ క్లాసిక్.. 1974లో విడుదలైన ‘‘అజ్‌నబీ’’ చిత్రం నుంచి ‘‘ఏక్‌ అజ్‌నబీ హసీనా సే’’ అనే పాటను ఆలపించారు.

Updated : 06 Sep 2021 17:09 IST

దిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి శశథరూర్‌ తాజాగా గాయకుడి అవతారమెత్తారు. ఇదంతా ఏ సినిమా కోసమో కాదండోయ్. సోమవారం శ్రీనగర్‌లో జరిగిన ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి ప్రాతినిధ్యం వహించారాయన. ఈసందర్భంగా.. దూరదర్శన్‌ శ్రీనగర్‌ ఏర్పాటు చేసిన  కార్యక్రమంలో.. అలనాటి బాలీవుడ్‌ క్లాసిక్.. 1974లో విడుదలైన ‘‘అజ్‌నబీ’’ చిత్రం నుంచి ‘‘ఏక్‌ అజ్‌నబీ హసీనా సే’’ అనే పాటను ఆలపించారు. ఈ పాట ఒరిజినల్‌ను గాయకుడు కిశోర్‌కుమార్‌ పాడగా ఇందులో హీరోహీరోయిన్లుగా రాజేష్‌ ఖన్నా, జీనత్ అమన్‌ నటించారు.  ‘‘ ఏమాత్రం ప్రాక్టీస్‌ చేయకుండా.. ఎంజాయ్‌ చేస్తూ పాడా’’ అంటూ ట్విటర్‌లో రాసుకొచ్చారు. ఫొన్‌లో లిరిక్స్‌ చూస్తూ చక్కటి హావభావాలు ఇస్తూ పాడుతూ ప్రేక్షకులను అలరించారాయన. ఆయన పాడటం మొదలుపెట్టగానే అందరూ సెల్‌ఫోన్లలో చిత్రీకరించడం ప్రారంభించారు.  ఆంగ్ల భాషా పరిజ్ఞానికి కేరాఫ్‌ అడ్రస్‌గా ఉండే శశిథరూర్‌ తనలోని ఈ టాలెంట్‌ బయటపెట్టగానే ప్రశంసలు వెల్లువెత్తాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని