Gender Equality Run: హైదరాబాద్‌లో ఉత్సాహంగా షీ టీమ్స్‌ 5కే, 2కే రన్‌

నగరంలోని షీ టీమ్స్‌ ఆధ్వర్యంలో నెక్లెస్‌రోడ్‌లో 5కె, 2కె రన్‌ నిర్వహించారు. రాష్ట్ర మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, ఎమ్మెల్యే దానం నాగేందర్‌, మేయర్‌ విజయలక్ష్మి, నగర సీపీ సీవీ ఆనంద్‌

Updated : 06 Mar 2022 13:37 IST

హైదరాబాద్‌: నగరంలోని షీ టీమ్స్‌ ఆధ్వర్యంలో నెక్లెస్‌రోడ్‌లో 5కే, 2కే రన్‌లను ఉత్సాహంగా నిర్వహించారు. రాష్ట్ర మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, ఎమ్మెల్యే దానం నాగేందర్‌, జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి, నగర సీపీ సీవీ ఆనంద్‌, షీ టీమ్స్‌ ఐజీ స్వాతి లక్రా తదితరులు హాజరై జెండా ఊపి పరుగును ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పేందుకు ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలు దోహదపడుతున్నాయని చెప్పారు.

షీ టీమ్స్‌ ఏర్పాటుతో మహిళలు ఆపదలో ఉన్న సమయాల్లో నిమిషాల్లోనే వారికి సాయం అందుతోందన్నారు. మహిళా దినోత్సవం పురస్కరించుకొని మహిళా లోకానికి మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. వివిధ కళాశాలకు చెందిన విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 5కే రన్‌ పీపుల్స్‌ ప్లాజా నుంచి ప్రారంభమై ట్యాంక్‌బండ్‌ పైనున్న లేపాక్షి వరకు సాగి, తిరిగి ప్రారంభమైన చోటే ముగిసింది. 2కే రన్‌ నెక్లెస్‌ రోడ్డు వరకు కొనసాగింది. ఈ రన్‌లో పాల్గొన్న వారికి అవార్డులు, మెడల్స్‌ ప్రదానం చేశారు.

ఆసక్తిగా దుర్గం చెరువు రన్‌- 2022

హైదరాబాద్‌లోని మాదాపూర్‌ ఇనార్బిట్‌ మాల్‌ వద్ద నుంచి ఈ ఉదయం దుర్గం చెరువు రన్‌- 2022 నిర్వహించారు. ఈ రన్‌లో యువతీ, యువకులు పాల్గొన్నారు. ఆదివారం కావడంతో రెండో విడత దుర్గం చెరువు రన్‌పై యువతతో పాటు మరికొందరు ఆసక్తి కనబరిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని