health:భుజం నొప్పి బాధిస్తోందా..
భుజం కీలు చాలా నొప్పిగా ఉండటంతో పాటు కొన్నిసార్లు పైకి ఎత్తడానికి కూడా వీలు కాదు..
ఇంటర్నెట్‌డెస్క్: భుజం నొప్పి ఉంటే సాధారణ పనులేవీ సరిగా చేసుకోలేం. కొన్నిసార్లు ఇతరుల సాయం కూడా తీసుకోవాల్సి వస్తుంది. కొవిడ్ వచ్చిన వారికి ఇలాంటి సమస్యలు అధికంగా ఉంటున్నాయి. భుజం కీలు నొప్పిగా ఉండటంతో పాటు కొన్నిసార్లు పైకి ఎత్తడానికి కూడా వీలు కాదు..ఇలాంటి పరిస్థితిని అధికమించడానికి ఆయుర్వేదంలో పలు పరిష్కారమార్గాలున్నాయని ఆయుర్వేద ఫిజిషియన్ పెద్ది రమాదేవి చెబుతున్నారు.
భుజం నొప్పి ఎందుకు వస్తుంది: మధుమేహం, కార్జిలేజ్ అరిగిపోవడం, ప్రమాదాలు జరగడం, భుజం ఎముకల్లో ఇన్ఫెక్షన్ సోకినపుడు చేయి పైకి ఎత్తడం, పనులు చేయడం కష్టంగా ఉంటుంది. చివరికి ఏదైనా రాయాలనుకున్నా ఇబ్బంది పడాల్సి వస్తుంది.
నివారణ ఎలా: భుజం నొప్పి వచ్చినపుడు మందులతో కాకుండా చిన్న చిన్న వ్యాయామాలతో తగ్గించుకోవచ్చు. చేతిని గోడకు పెట్టి లేపడం, టవల్‌తో వీపు భాగంవైపు కదలికలు తీసుకొని రావడంతో కాస్త ఉపశమనంగా ఉంటుంది. మధుమేహం ఉంటే ముందుగా దాన్ని నియంత్రించుకోవాలి. సూర్య నమస్కారాలు చేసినా ప్రయోజనకరంగా ఉంటుంది. విశ్రాంతి తీసుకోవడం అన్నింటి కంటే చాలా మంచిది.
* రెండు టేబుల్ స్పూన్ల పసుపునకు ఒక చెంచా కొబ్బరినూనె కలిపి నొప్పి ఉన్న ప్రదేశంలో పూత లాగా పూయాలి.
* లావెండర్ నూనె గానీ ఒకటి, రెండు చెంచాల గోరు వెచ్చటి ఆలీవ్నూనెనుతో గానీ మర్దన చేయాలి.
* నువ్వుల నూనె మునగ, చింతాకు వేసి రాయాలి
* దశమూలల తైలం కూడా బాగా పని చేస్తుంది,
* చల్లని, వేడి నీటితో కాపడం పెడితే నొప్పి తగ్గిపోతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్