అమెరికాలో కాల్పులు.. నలుగురు మృతి

అమెరికాలో మరోసారి తుపాకి సంస్కృతి ప్రాణాలు బలిగొంది. సిన్సినాటీలో నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో  దుండగులు జరిపిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు.

Published : 17 Aug 2020 15:45 IST

ఇంటర్సెట్‌ డెస్క్‌: అమెరికాలో మరోసారి తుపాకి సంస్కృతి ప్రాణాలు బలిగొంది. సిన్సినాటీలో నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో  దుండగులు జరిపిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఓవర్‌ ది రైన్‌ ప్రాంతంలో జరిగిన పాశవిక దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోగా పది మంది గాయపడ్డారు. వాల్‌నట్‌ హిల్స్‌లో దుండగులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు గాయపడ్డారు. గంట వ్యవధిలో ఈ విషాద ఘటనలు చోటుచేసుకొన్నట్లు పోలీసులు తెలిపారు. కాల్పులకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించలేదు. ఇప్పటివరకు దుండగుల సమాచారం లభించలేదని సిన్సినాటీ పోలీసు ముఖ్యాధికారి ఎల్యార్ట్‌ ఐజాక్‌ చెప్పారు. దుండగుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.  మరోవైపు టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో జరిగిన కాల్పుల్లో పలువురు పోలీసులు గాయపడ్డారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని