Telangana News: ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ప్రాథమిక పరీక్ష ఫలితాలు విడుదల

తెలంగాణలో ఎస్‌, కానిస్టేబుల్‌ ఉద్యోగాలు నిర్వహించిన ప్రాథమిక పరీక్ష ఫలితాలను పోలీసు నియామక మండలి విడుదల చేసింది.

Updated : 21 Oct 2022 19:57 IST

హైదరాబాద్‌: తెలంగాణలో ఇటీవల నిర్వహించిన ఎస్సై, కానిస్టేబుల్‌ ప్రాథమిక పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈమేరకు పోలీస్‌ రిక్రూట్‌మెంట్ బోర్డు ఫలితాలను వెల్లడించింది. సివిల్‌ ఎస్సై ప్రిలిమినరీ పరీక్షలో 46.80 శాతం, సివిల్‌ కానిస్టేబుల్‌ ప్రాథమిక పరీక్షలో 31.40శాతం, రవాణా కానిస్టేబుల్‌ పరీక్షలో 44.84శాతం, ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌  పరీక్షలో 43.65శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొంది. పోలీస్‌ సివిల్‌ విభాగంలో 15,644.. ఆబ్కారీశాఖలో 614.. రవాణాశాఖలో 63 కానిస్టేబుల్‌ పోస్టుల కోసం 1601 కేంద్రాల్లో  ఆగస్టు 7న ప్రాథమిక పరీక్ష జరిగింది. మొత్తం 6,61,198 మంది దరఖాస్తుదారులకుగాను 6,03,955 (91.34శాతం) మంది హాజరయ్యారు. అభ్యర్థులు మొబైల్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చని పోలీసు నియామక సంస్థ తెలిపింది. 

ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) నిర్వహించిన ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పోస్టుల రాత పరీక్షల కటాఫ్‌ మార్కులను ప్రభుత్వం సవరించింది. 200 మార్కులకుగాను 60 మార్కులు ఓసీలకు, 50 బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు 40 మార్కులు ఉంటాయని పేర్కొంది. గతంలో ఈ మార్కులు ఓసీలకు 80, బీసీలకు 70, ఎస్సీ, ఎస్టీలకు 60 ఉండగా.. దీన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పలువురు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ సి.వి.భాస్కర్‌రెడ్డిల ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషన్‌ విచారణలో ఉండగానే ప్రభుత్వం కటాఫ్‌లను సవరించడంతో ధర్మాసనం పిటిషన్‌పై విచారణను మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని