చీరాల ఘటనలో ఎస్‌ఐ అరెస్ట్‌

ప్రకాశం జిల్లా చీరాల రెండో పట్టణ ఎస్‌ఐ విజయ్‌ కుమార్‌ అరెస్ట్‌ అయ్యారు. ఎస్సీ యువకుడు కిరణ్‌ కుమార్‌ మృతి కేసులో...

Published : 01 Aug 2020 23:30 IST

చీరాల: ప్రకాశం జిల్లా చీరాల రెండో పట్టణ ఎస్‌ఐ విజయ్‌ కుమార్‌ అరెస్ట్‌ అయ్యారు. ఎస్సీ యువకుడు కిరణ్‌ కుమార్‌ మృతి కేసులో నిర్లక్ష్యం వహించారని ఇప్పటికే విజయ్‌ కుమార్‌ సస్పెన్షన్‌లో ఉన్నారు. చీరాలలో ఎస్‌ఐను ఇంకొల్లు సీఐ రాంబాబు అరెస్ట్‌ చేశారు. 

చీరాల థామస్‌పేటకు చెందిన వై.కిరణ్‌కుమార్‌ (26), ఆయన స్నేహితుడు వి.షైనీ అబ్రహం గత శనివారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై కొత్తపేట నుంచి చీరాలకు వస్తున్నారు. మాస్క్‌ పెట్టుకోలేదని కొత్తపేట చెక్‌పోస్టు వద్ద పోలీసులు ఆపారు. అక్కడ యువకులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న రెండో పట్టణ ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ అక్కడకు చేరుకున్నారు.
ఆ సమయంలో ఎస్‌ఐ తీవ్రంగా కొట్టడం వల్లే తమ కుమారుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడని కిరణ్‌కుమార్‌ తండ్రి మోహన్‌రావు ఆరోపించారు. మెరుగైన వైద్యం కోసం కిరణ్‌ను గుంటూరు ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని