Telangana News: ఎస్‌ఐ పరీక్షకు 2.25లక్షల మంది హాజరు.. త్వరలోనే ప్రిలిమినరీ ‘కీ’

తెలంగాణలో ఎస్ఐ ప్రిలిమినరీ రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 544 పోస్టుల కోసం ఏప్రిల్‌ 25న నోటిఫికేషన్ విడుదల కాగా.. 2,47,217 మంది దరాఖాస్తు చేసుకున్నారు. 

Published : 07 Aug 2022 18:52 IST

హైదరాబాద్‌: తెలంగాణలో ఎస్ఐ ప్రిలిమినరీ రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 544 పోస్టుల కోసం ఏప్రిల్‌ 25న నోటిఫికేషన్ విడుదల కాగా.. 2,47,217 మంది దరాఖాస్తు చేసుకున్నారు. పరీక్ష కోసం హైదరాబాద్‌ సహా పరిసర ప్రాంతాల్లో 503 పరీక్ష కేంద్రాలు, మిగిలిన జిల్లాల్లో 35 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇవాళ జరిగిన ప్రాథమిక పరీక్షకు 91.32 శాతం మంది హాజరైనట్లు రిక్రూట్‌మెంట్‌ బోర్డు తెలిపింది. మొత్తం 2,25,759 మంది పరీక్ష రాసినట్లు వెల్లడించింది. త్వరలోనే ప్రిలిమినరీ పరీక్ష ‘కీ’ని www.tslprb.in లో ఉంచుతామని బోర్డు పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని