Andhra News: ఛైర్మన్‌కు తెలియకుండా సభ్యుల ప్రమాణ స్వీకారమా?: అశోక్‌గజపతిరాజు

సింహాద్రి అప్పన్న ఆలయ ట్రస్ట్‌బోర్డు సమావేశం వాడివేడిగా సాగింది. రెండోసారి ట్రస్ట్‌బోర్డు సభ్యులుగా ప్రమాణం స్వీకారం చేసిన సభ్యులు తనకు తెలియకుండా ఏవిధంగా

Published : 21 Jun 2022 19:00 IST

విశాఖపట్నం: సింహాద్రి అప్పన్న ఆలయ ట్రస్ట్‌బోర్డు సమావేశం వాడివేడిగా సాగింది. రెండోసారి ట్రస్ట్‌బోర్డు సభ్యులుగా ప్రమాణం స్వీకారం చేసిన సభ్యులు తనకు తెలియకుండా ఏవిధంగా ప్రమాణం చేస్తారని బోర్డు ఛైర్మన్‌ అశోక్‌గజపతిరాజు లీగల్‌ ఒపీనియన్‌కు లేఖ రాయడం దుమారం రేపింది. సమావేశంలో ఈవో మాట్లాడుతూ.. తాను ఉద్దేశపూర్వకంగా చేసిందికాదని, ఆ సమయంలో స్వామివారి కల్యాణం, చందనోత్సవం ఉన్న కారణంగా అత్యవసర పరిస్థితుల్లో ప్రమాణ స్వీకారం చేయించాల్సి వచ్చిందని వివరించారు. ఈ సమావేశంలో మొత్తం 46 అంశాలకు సంబంధించిన ప్రతిపాదనలను సభ్యులతో పాటు ఛైర్మన్‌ అశోక్‌గజపతిరాజు ఆమోదించారు. సమావేశం అనంతరం అశోక్‌ గజపతిరాజు మీడియాతో మాట్లాడుతూ... విద్యుత్‌ బస్సులను సింహగిరిపైకి నడపేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని తెలిపామన్నారు. తిరుపతిలో ఎలక్ట్రిక్‌ బస్సుల మాదిరిగానే ఇక్కడ కూడా బస్సులు నడపాలని నిర్ణయించామన్నారు. గోశాలలో సోలార్‌ పవర్‌ప్లాంట్‌ ఉందని, దాని ద్వారా విద్యుత్‌ వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు