కరోనా వేళ వృద్ధుల్లో ఆందోళన తగ్గించండి!

కరోనా వైరస్‌ వృద్ధుల మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. వాళ్లు శారీరకంగానూ, మానసికంగానూ కుంగుబాటుకు లోనవుతున్నారు. లాక్‌డౌన్‌లో ఇంటి వద్ద ఒంటరిగా ఉంటున్న వృద్ధలు నెగిటివ్‌ వార్తలు వినడం వల్ల, ఎవరూ తమతో మాట్లాడకపోవడం వల్ల

Updated : 29 May 2021 06:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వైరస్‌, కోవిడ్‌ మరణాల గురించిన వార్తలు వృద్ధుల మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి. వాళ్లు శారీరకంగానూ, మానసికంగానూ కుంగుబాటుకు లోనవుతుంటారు. లాక్‌డౌన్‌లో ఇంటివద్ద ఒంటరిగా ఉంటున్న వృద్ధులు నెగిటివ్‌ వార్తలు వినడం వల్ల, ఎవరూ తమతో మాట్లాడకపోవడం వల్ల ఆందోళనకు గురవుతారని నిపుణులు చెబుతున్నారు. వాళ్ల ఆందోళన పోగొట్టడానికి కొన్ని సూచనలు ఇచ్చారు. అవేంటో చూద్దాం.. 

* ఒంటరిగా ఉండే వృద్ధులకు.. వాళ్ల భావాలను పంచుకోవడానికి సురక్షితమైన వాతావరణాన్ని కల్పించండి. మనసులోని భావాలను ఇతరులతో పంచుకోవడం వల్ల కొంత ఆందోళన తగ్గుతుంది. 

* వయసు పెరిగే కొద్దీ కాస్త చాదస్తం వస్తుంది. అందుకని వాళ్ల మాటలను పెడచెవిన పెట్టకండి. వాళ్లు చెప్పే ప్రతి మాటను ఓపిగ్గా, విసుగు చెందకుండా వినండి. మీ జీవితంలో జరుగుతున్న విషయాలను వాళ్లతో పంచుకోండి. మీకున్న సమస్యల నుంచి బయట పడటానికి వాళ్ల దగ్గరి నుంచి సలహాలు తీసుకోండి. 

* వృద్ధులు ప్రతిదానికి ఎవరో ఒకరి మీద ఆధారపడుతుంటారు. ఒక్కోసారి సాయం చేసేవాళ్లు విసుక్కుంటుంటారు. దాంతో వాళ్లు బాధపడతారు. కాబట్టి వాళ్ల వయసుకు గౌరవం ఇచ్చి వాళ్లు ఏ చిన్న పని చెప్పినా చేయండి. రోజువారీ పనుల్లో వాళ్లకు సాయం చేయండి. భోజనం వడ్డించడం, సమయానికి మందులు అందించడం, వ్యాయామం దగ్గరుండి చేయించడం లాంటివి.

* మానసిక ఆనందాన్ని కలిగించడానికి పాతపాటలు వినిపించండి. కూర్చుని ఆడుకునే ఆటలు కార్డ్స్‌, చెస్‌, క్యారంబోర్డు వంటివి వాళ్లతో కలిసి ఆడండి. ఆడేటప్పుడు వాళ్లతో మాట్లాడుతూ, వాళ్ల జీవితంలో జరిగిన సంఘటనలను అడిగి తెలుసుకోండి. 

* ఎంత బిజీగా ఉన్నా రోజూ వాళ్లకోసం కొంత సమయం కేటాయించండి. కరోనాకు సంబంధించి నెగిటివ్‌ వార్తలను పదేపదే చూడకుండా జాగ్రత్త పడండి. ఎంతకూ వాళ్లలో ఆందోళన తగ్గక పోతే మానసిక ఆరోగ్య నిపుణుల వద్దకు తీసుకెళ్లండి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని