Published : 28 Jun 2022 02:09 IST

Anand Mahindra: క్వాలిఫికేషన్‌ అడిగిన నెటిజన్‌.. వైరల్‌గా మారిన ఆనంద్‌ మహీంద్రా సమాధానం!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా.. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటారన్న విషయం తెలిసిందే.  పోస్టులతోపాటు ప్రతిభావంతులు, ఇబ్బందుల్లో ఉన్నవారిని గుర్తించి.. అండగా నిలుస్తుంటారు. నెటిజన్ల పోస్టులపైనా స్పందిస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ‘మీ క్వాలిఫికేషన్‌ తెలుసుకోవచ్చా’ అని ఓ నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు ఆయన తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఏం జరిగిందంటే.. హిమాచల్‌ప్రదేశ్‌లో పర్యటిస్తోన్న ఓ వ్యక్తి.. అక్కడి పర్వత ప్రాంతంలో ఓ చిన్నారి ఒంటరిగా కూర్చుని చదువుకుంటున్న ఫొటోను ట్విటర్‌లో పోస్ట్‌ చేసి.. ఆమె తపనను కొనియాడారు.

అనంతరం.. ఆనంద్‌ మహీంద్రాకూ ఆ పోస్టును ట్యాగ్‌ చేశారు. మహీంద్రా సైతం ఆమె పట్టుదలకు ముగ్ధుడై.. ‘అందమైన చిత్రం ఇది. ఈ బాలిక నాకు ప్రేరణ’ అని రిప్లై ఇచ్చారు. ఈ క్రమంలోనే ఓ నెటిజన్‌ ‘సర్‌. మీ క్వాలిఫికేషన్‌ తెలుసుకోవచ్చా’ అంటూ మహీంద్రాను ఉద్దేశించి ఆ పోస్టుపై కామెంట్‌ పెట్టారు. దానికి ఆయన బదులిస్తూ.. ‘స్పష్టంగా చెప్పాలంటే, నా వయస్సులో.. ఏ యోగ్యతకైనా కేవలం అనుభవమే అర్హత’ అని తెలిపారు. ఈ రిప్లై కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఆ ప్రశ్న అడిగిన వ్యక్తిపై మండిపడిన నెటిజన్లు.. మరోవైపు ఆనంద్‌ మహీంద్రా సమాధానంపై ప్రశంసలు కురిపించారు. వాస్తవానికి చిన్నతనంలో తమిళనాడులో పాఠశాల విద్యను అభ్యసించిన ఆనంద్‌ మహీంద్రా.. హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌లో ఎంబీఏ పూర్తి చేశారు.


Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని