నాడు ఖేదం.. నేడు మోదం

సర్కారు బడి అంటే విరిగిన కుర్చీలు, పెచ్చుతూడుతున్న స్లాబులు, తిరగని ఫ్యానులు, వెలగని బల్బులు, తాగు నీటి కోసం ఇక్కట్లు, సౌచాలయాలు లేక అవస్థలు.. ఇలా సమస్యలే గుర్తొస్తాయి....

Published : 02 Feb 2021 23:20 IST

సకల సౌకర్యాలతో ముస్తాబైన సిరిసిల్ల ప్రభుత్వ పాఠశాల

ఇంటర్నెట్‌ డెస్క్‌: సర్కారు బడి అంటే విరిగిన కుర్చీలు, తిరగని ఫ్యానులు, వెలగని బల్బులు, తాగు నీటి కోసం ఇక్కట్లు, సౌచాలయాలు లేక అవస్థలు.. ఇలా సమస్యలే గుర్తొస్తాయి. కానీ సిరిసిల్ల గీతానగర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను చూస్తే మాత్రం ఇది సర్కారు బడేనా అంటూ ఆశ్చర్యపోవాల్సిందే. కరోనా విజృంభణతో ఇళ్లకు వెళ్లిన విద్యార్థులు తిరిగివచ్చేసరికి ఆ పాఠశాల రూపురేఖలే మారిపోయాయి. మంత్రి కేటీఆర్‌ చొరవతో కార్పొరేట్‌ స్కూల్‌ను తలదన్నేలా ముస్తాబుచేశారు. సీఎస్‌ఆర్‌ నిధులతో ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యంతో పాఠశాలను తీర్చిదిద్దారు. ఒకప్పుడు శిథిలావస్థలో ఉన్న తరగతి గదులు నేడు ఆధునిక హంగులతో మెరిసిపోతున్నాయి. వసతుల లేమితో సతమతమైన పాఠశాల నేడు అత్యాధునిక హంగులతో విద్యార్థులకు ఆహ్వానం పలుకుతోంది.

సుమారు రూ.3 కోట్లు వెచ్చించి పాఠశాలను అభివృద్ధి చేశారు. దాదాపు 1000 మంది విద్యార్థులు విద్యనభ్యసించేలా 20 తరగతి గదులు, గ్రంథాలయం, 32 కంప్యూటర్లతో ల్యాబ్‌ సహా ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించారు. 400 మంది విద్యార్థులు ఒకేసారి కూర్చొని భోజనం చేసేలా భోజనశాల, బాలికలకు నిరంతరం రక్షణ కల్పించేలా 12 సీసీ కెమెరాలను ఏర్పాటుచేశారు. క్రీడా మైదానం పాఠశాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అందుబాటులోకి వచ్చిన సౌకర్యాలతో మురిసిపోతున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

ఇవీ చదవండి...

నా భర్త చదివిన పాఠశాల ఫొటో తీయండి

జైలులో పద్మజ కేకలు
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని