TSPSC: సిట్ దూకుడు.. అభియోగపత్రంలో 37మంది నిందితుల పేర్లు!
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వచ్చే వారంలో అభియోగపత్రం దాఖలు చేయనున్నట్లు సమాచారం.

హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు దూకుడు పెంచారు. నిందితులపై అభియోగపత్రం దాఖలు చేయనున్నారు. ఇందులో 37మంది నిందితులను చేర్చనున్నారు. న్యాయసలహా తీసుకొని వచ్చే వారంలో అభియోగపత్రం దాఖలు చేసే యోచనలో సిట్ అధికారులు ఉన్నట్లు సమాచారం.
పేపర్ లీకేజీ కేసులో సిట్ అధికారులు ఇప్పటి వరకు 50మందిని అరెస్ట్ చేశారు. ఇందులో 15మంది నిందితులు బెయిల్‌పై బయటికి వచ్చారు. ప్రధాన నిందితుడు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డితో పాటు మిగతా నిందితులు జైల్లోనే ఉన్నారు. అనుబంధ అభియోగపత్రంలో మిగతా నిందితుల పేర్లను చేర్చే యోచనలో సిట్ అధికారులు ఉన్నారు. మరోవైపు డీఈ పూల రమేష్ అరెస్టుతో ఈ కేసు కొత్త మలుపు తిరుగుతోంది. కొందరు అభ్యర్థులతో హైటెక్ మాస్ కాపీయింగ్ చేయించిన పూల రమేష్.. ఏఈ ప్రశ్నపత్రాన్ని దాదాపు 80మందికి విక్రయించినట్లు సిట్ అధికారుల దర్యాప్తులో తేలింది. దీంతో ఈ కేసులో అరెస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Missing Children: తొమ్మిదేళ్లలో 4.46 లక్షల చిన్నారుల ఆచూకీ లభ్యం: స్మృతీ ఇరానీ
-
Hyderabad: తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టనున్న సింటెక్స్ సంస్థ
-
Income tax refund: ఆదాయపు పన్ను రిఫండ్స్.. ఐటీ శాఖ కీలక సూచన
-
Chandrababu Arrest: విశాఖలో తెదేపా శ్రేణుల కొవ్వొత్తుల ర్యాలీ.. అడ్డుకున్న పోలీసులు
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Modi: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పు