TSPSC Paper Leak Case: సిట్‌ అధికారుల దర్యాప్తు ముమ్మరం.. ఐటీ ఉద్యోగి అరెస్టు

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసులో సిట్‌ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఉద్యోగిని సిట్‌ అధికారులు తాజాగా అరెస్టు చేశారు.

Updated : 28 May 2023 22:08 IST

హైదరాబాద్‌: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో (TSPSC paper Leakage case) అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేసిన సిట్‌ అధికారులు తాజాగా మరొకర్ని అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు ప్రవీణ్‌ స్నేహితుడు, ఐటీ సంస్థ విప్రోలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న నర్సింగరావును అరెస్టు చేశారు. నిందితుడు ప్రవీణ్ నుంచి ఏఈఈ పేపర్‌ను పొందినట్లు సిట్ అధికారులు గుర్తించారు. డబ్బు తీసుకోకుండానే ప్రవీణ్‌ పేపర్‌ ఇచ్చినట్లు సిట్‌ దర్యాప్తులో తేలింది. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టయిన వారి సంఖ్య 44కి చేరింది.

మరోవైపు ఏఈ సివిల్ పేపర్ భారీఎత్తున చేతులు మారినట్లు సిట్‌ దర్యాప్తులో తేలింది. ఇటీవల కీలక నిందితుడు రవికిషోర్‌ను అరెస్ట్ చేసి విచారిస్తుండగా.. నిందితుల చిట్టా పెరిగిపోతోంది. అతని వద్ద ప్రశ్నపత్రం విక్రయించిన వారి వేటలో సిట్‌ పోలీసులు ఉన్నారు. ఇదే క్రమంలో వరంగల్‌కి చెందిన విద్యుత్ శాఖ డీఈ రమేష్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. శనివారం అతనితో పాటు మరో నలుగురిని సిట్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని