సినిమాల విడుదలకు మార్గం సుగమం

తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్‌, సంక్రాంతి పండుగలకు కొత్త సినిమాల విడుదలకు మార్గం సుగమమైంది.

Updated : 10 Aug 2022 12:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్‌, సంక్రాంతి పండుగలకు కొత్త సినిమాల విడుదలకు మార్గం సుగమమైంది. వర్చువల్‌ ప్రింట్‌ ఫీజలతో పాటు నిర్వహణ ఛార్జీల విషయంలో కొన్నిరోజులుగా నిర్మాతలు, ఎగ్జిబిటర్లకు మధ్య వివాదం నెలకొంది. ఈ అంశానికి తాత్కాలికంగా తెరదించుతూ నిర్మాతల మండలి నిర్ణయాన్ని ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లోని సింగిల్‌ స్ర్కీన్‌ థియేటర్లలో ఈ నెలలో విడుదలయ్యే కొత్త సినిమాలకు వీపీఎఫ్‌ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. 

వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చిలో విడుదలయ్యే సినిమాలకు డిజిటల్ ఛార్జీల్లో 40 శాతం నిర్మాతలే చెల్లిస్తారని తెలిపింది. డిజిటల్‌ ఛార్జీల సర్వీసుల విషయంలో వచ్చే ఏడాది మార్చి31 లోపు ఒప్పందం జరిగే అవకాశం ఉందని తెలుగు నిర్మాతల మండలి పేర్కొంది. ఇతర రాష్ట్రాల్లో డిజిటల్‌ సర్వీసుల ప్రొవైడర్లతో జరుగుతున్న చర్చల్లో వచ్చే నిర్ణయాలను తెలుగు పరిశ్రమలోనూ అమలు చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించింది. తెలుగు సినీ పరిశ్రమ పునఃప్రారంభించడానికి సర్వీసు ప్రొవైడర్లు సహకరించాలని నిర్మాతల మండలి విజ్ఞప్తి చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని