Viveka Murder Case: శివశంకర్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడు శివశంకర్‌ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టివేసింది.

Updated : 19 Sep 2023 22:44 IST

హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడు శివశంకర్‌ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో  ఏ-5 నిందితుడిగా ఉన్న శివ శంకర్‌రెడ్డి తనకు బెయిల్‌ మంజూరు చేయాలంటూ గతంలో పిటిషన్‌ దాఖలు చేశారు. బెయిల్ మంజూరు చేయొద్దంటూ సీబీఐ తరఫు న్యాయవాది చేసిన వాదనను కోర్టు పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం శివశంకర్ రెడ్డి పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. శివశంకర్ రెడ్డి ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని