
70 శాతం మరణాలు ఆ రాష్ట్రాల్లోనే
దిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా మన దేశంలోని మరణాల్లో 70 శాతానికి పైగా ఆరు రాష్ట్రాల్లోనే నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. మహారాష్ర్ట, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ్ బెంగాల్ రాష్ట్రాల్లోనే ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయని తెలిపింది. ఇటీవల పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నా.. మరణాల సంఖ్య మాత్రం ఆందోళన కలిగిస్తోంది. బుధవారం దేశవ్యాప్తంగా 3,207 మంది మహమ్మారికి బలయ్యారు. మహారాష్ట్రలో 854, తమిళనాడులో 490, కర్ణాటకలో 464, కేరళలో 194, ఉత్తర్ ప్రదేశ్లో 175, పశ్చిమ్ బెంగాల్లో 137 మంది కరోనాతో మృతి చెందారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 3,35,102 మంది కరోనాతో చనిపోయారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.