Skin Care: అందమైన చర్మం కావాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అలాగే ముస్తాబవుతారు కూడా! కానీ తాత్కాలికంగా ఉండే అందం కన్నా ఆరోగ్యంగా కూడా ఉండాలి. మరి అలాంటి అందం ఎలా సొంతం చేసుకోవచ్చో తెలుసుకోండి.

Published : 31 Oct 2022 01:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అందంగా కనిపించేందుకు అతివలు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ, తాత్కాలికంగా ఉండేందుకు ఎన్ని సౌందర్య ఉత్పత్తులు వాడినా ఫలితం కొద్దిసేపటి వరకే ఉంటుంది. అలా కాకుండా చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే కాస్త శ్రద్ధ వహించాల్సిందే! మనం తినే తిండి, ఉండే విధానం కూడా చర్మ సౌందర్యంపై ప్రభావం చూపిస్తాయి. అందువల్ల రోజూ వారి పనులతో పాటు చర్మానికి కూడా కాస్త సమయం కేటాయించాలి. ఆరోగ్యంతో పాటు అందం కూడా సొంతమవ్వాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సిందే!

  • జిడ్డు, పొడి చర్మాలు కలిగిన వారు వాటి తత్వాన్ని బట్టి క్లెన్సర్‌ వాడాలి. దీంతో చర్మం మృదువుగా ఉంటుంది.
  • చర్మం ఎప్పుడూ తాజాగా ఉండే విధంగా ఉండేలా చూసుకోవాలి. చెమటగా ఉన్నా లేదా, డ్రై అయినా మంచి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. దీంతో చర్మం టాన్‌ ఫ్రీగా ఉంటుంది.
  • స్నానం చేసిన తర్వాత మాశ్చరైజర్‌ను వాడాలి. దీంతో శరీరం మృదువుగా ఉంటుంది.
  • బయటకు వెళ్లినప్పుడు సన్‌ స్క్రీన్‌ లోషన్‌ రాసుకోవాలి. దీంతో బయట ఉండే దుమ్ము ధూళి వల్ల చర్మం నిర్జీవం కాకుండా ఉండేందుకు తోడ్పడుతుంది. సూర్యరశ్మి నుంచి చర్మాన్ని కాపాడుతుంది. 
  • పెదవుల ఆరోగ్యం కోసం తరచూ లిప్‌బామ్‌ ఉపయోగిస్తూ ఉండండి. 
  • వారానికోసారి, లేదా నెలకు రెండు సార్లైనా శరీరానికి నూనె రాసుకొని మర్దన చేసుకోవాలి. 
  • ముఖానికి ఇంట్లో ఉండే పెరుగు, పసుపు, తేనె వంటి వాటితో పాక్‌ వేసుకోవాలి. 
  • ఎక్కువ రసాయనాలు ఉండే ఉత్పత్తుల కన్నా సహజ సిద్ధంగా తయారు చేసిన వాటిని ఉపయోగించడం ఉత్తమం. నాణ్యమైన వాటిని ఎంపిక చేసుకొని చర్మాన్ని అందంగా, ఆరోగ్యంగా ఉంచుకోండి. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు