Skincare: వస్తోంది చలికాలం.. చర్మ సౌందర్యానికి గడ్డుకాలం!

చలికాలం వచ్చిందంటే చాలు చర్మం మృదుత్వాన్ని కోల్పోతుంది. పొడిబారటం, నల్లగా మారటం వంటి సమస్యలు తలెత్తుతాయి. మరి ఈ గడ్డుకాలం నుంచి చర్మాన్ని ఎలా రక్షించుకోవాలో తెలుసుకోండి. 

Published : 27 Oct 2022 01:56 IST


ఇంటర్నెట్‌ డెస్క్‌: చలి మొదలైంది. దీంతో చర్మం పొడిబారటం, నిర్జీవంగా మారటం కూడా మొదలవుతుంది. చలికాలంలో చర్మాన్ని కాపాడుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

* చర్మ మృదుత్వాన్ని కాపాడుకునేందుకు ప్రతి రోజూ మాశ్చురైజర్ కచ్చితంగా వాడాల్సిందే! స్నానం చేసిన తరవాత, పడుకునే ముందు మాశ్చరైజర్‌ రాసుకోండి. 

* ఇప్పటికే చలికి వణికిపోతున్నాం. కాసిన్ని నీళ్లు తాగితే చలి ఎక్కువైతుందనే భావన చాలా మందికి ఉంటుంది. దీంతో ఎక్కువగా నీళ్లు ఎక్కువగా తాగరు. ఆరోగ్యంగా ఉండాలన్నా, చర్మం అందంగా కాంతివంతంగా ఉండాలన్నా నీళ్లు ఎక్కువగా తాగాలి. అందువల్ల చలికాలంలో గోరు వెచ్చని నీళ్లు తాగితే మరిన్ని మంచి ఫలితాలుంటాయి. 

 * పెదవులు అందంగా కనిపించాలనే ఆలోచనతో రకరకాల క్రీమ్‌లను, మార్కెట్లో దొరికే రకరకాల లిప్‌బామ్‌లను, లిప్‌స్టిక్‌లను ఉపయోగిస్తుంటారు. ఇందులో నాణ్యమైన వాటిని ఎంచుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఈ క్రీములు నాణ్యమైనవి కాకుంటే పెదవులు నిర్జీవమవుతాయి. అందువల్ల ఇంట్లో ఉండే వాటితో చర్మాన్ని అందంగా ఆరోగ్యంగా ఉంచుకోండి. 

* ఇంట్లో అందుబాటులో ఉండే తేనె, నెయ్యి, పాల మీగడతో పెదవులకు ప్యాక్‌ వేసుకోవచ్చు. 

* వాతావరణం చల్లగా ఉండటం వల్ల చర్మం తొందరగా పొడిబారిపోతుంటుంది. అందువల్ల చర్మం తేమను కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. 

* బయటకు వెళ్లేటప్పుడు చర్మం పూర్తిగా కనిపించకుండా ఉండేలా చూస్కోవాలి. ఉన్నితో తయారు చేసిన దుస్తులను ధరించాలి. 

* గ్లౌజులు ధరించి బయటకు వెళ్లండి. కాళ్లకు షూ వేసుకోవటం మంచిది. దీనివల్ల బయటకు వెళ్లినప్పుడు దుమ్ము, ధూళి కణాలు చర్మానికి హాని చేయకుండా ఉంటాయి. ఎండ నుంచి కూడా రక్షణగా ఉంటుంది. 

* చలిగా ఉందని బద్దకించకుండా జాగింగ్‌కు వెళ్లాలి. దీంతో రోజంతా ఉత్సాహంగా ఉంటారు. 

* చలికి చాలామంది ఎక్కువసార్లు టీ, కాఫీలు తాగుతుంటారు. ఇది ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. రోజుకి రెండు కప్పులు మాత్రమే తాగేలా చూసుకోండి. వీటికి ప్రత్యామ్నాయంగా రాగిమాల్ట్‌ తాగవచ్చు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని