Sleep: పని వేళలో నిద్ర వస్తుందా? కారణాలేంటో తెలుసుకోండి!

పని వేళల్లో నిద్ర... ఎంత చిరాకుగా ఉంటుందో చెప్పలేం! మధ్యాహ్న భోజనం తరవాత శరీరం ఏమాత్రం పని చేసేందుకు సహకరించదు.

Published : 28 Sep 2022 01:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పని వేళల్లో నిద్ర... ఎంత చిరాకుగా ఉంటుందో చెప్పలేం! మధ్యాహ్న భోజనం తరవాత శరీరం ఏమాత్రం పని చేసేందుకు సహకరించదు. దీంతో పనిపై శ్రద్ధ పెట్టలేరు. ఇది మామూలుగా ఉండే సమస్యే. కానీ రోజంతా ఇలాగే ఉంటే ఎలా ఉంటుంది. చాలా ఇబ్బందిగా ఉంటుంది. అసలు ఈ సమస్య తలెత్తడానికి కారణాలేంటి! పరిష్కారాలేంటో తెలుసుకుందాం. 

* రాత్రి భోజనం ఆలస్యంగా చేయడం..
రాత్రి భోజనం ఆలస్యంగా చేయడం వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. భోజనం చేసిన 3 నుంచి 4 గంటల  తరవాత  నిద్రకు ఉపక్రమించాలి. వీలైనంత తొందరగా రాత్రి భోజనం చేసేలా ఏర్పాటు చేసుకోవాలి. లేట్‌ నైట్స్‌ ఏ ఆహారం అయినా తినకూడదు. 

* ఎలక్ట్రానిక్‌ పరికరాలు....
ప్రస్తుతం చాలామంది ఎలక్ట్రానిక్‌ పరికరాలతోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. అవసరానికి మించి వీటికి సమయం వెచ్చిస్తున్నారు. తక్కువ వెలుతురులో ఎలక్ట్రానిక్‌ పరికరాలను ఉపయోగించడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. సాధ్యమైనంత మేరకు ఎలక్ట్రానిక్‌ పరికరాల వాడకం భోజన సమయానికి ముందు వరకు పరిమితం చేసుకోవాలి. 
 

* మంచి నిద్ర..
మంచి నిద్ర కావాలంటే చుట్టూ ఉండే పరిసరాలు కూడా బాగుండాలి. రోజూ ఒకే సమయానికి నిద్రపోయేలా చూసుకోవాలి. పడుకునే ముందు గదిలోకి వెలుతురు లేకుండా చూసుకోవాలి. దీంతో నిద్ర బాగా పడుతుంది. 
 

*ఆల్కహాల్‌...
ఆల్కహాల్‌ తాగడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. నిద్రలేమితో శరీర ఆరోగ్యవ్యవస్థ మీద ప్రభావం పడుతుంది. దీంతో ఏ పనిని సంపూర్ణంగా చేయలేరు. ఆల్కహాల్ కు ఎంత దూరంగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటారు. 

* కాఫీలు, టీలు రాత్రి సమయంలో వద్దు..
కాఫీ, టీల్లొ ఉండే కెఫిన్‌ నిద్రను దూరం చేస్తుంది. రాత్రి సమయంలో వీటిని తాగడం వల్ల నిద్ర రాదు. భోజనం తర్వాత కాఫీ, టీలు తాగకూడదు. 

* రాత్రి పడుకునే ముందు పుస్తకం చదవటం అలవాటు చేసుకోండి.
* పసుపు కలిపిన పాలను నిద్రపోయే ముందు తాగండి. దీంతో హాయిగా నిద్రపడుతుంది. 
* కచ్చితంగా 6 నుంచి 8 గంటల సమయం వరకూ నిద్రపోవాలి. దీంతో చిరాకు, అలసట, నీరసం దరి చేరవు. రోజంతా ఉత్సాహంగా ఉండగలుగుతారు. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని