JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్‌.. సికింద్రాబాద్‌లో స్మార్ట్‌ కాపీయింగ్‌

ఐఐటీల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి దేశవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో స్మార్ట్‌ కాపీయింగ్‌ జరిగింది.

Updated : 06 Jun 2023 16:12 IST

హైదరాబాద్‌: ఐఐటీల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి దేశవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో స్మార్ట్‌ కాపీయింగ్‌ జరిగింది. దీనికి సంబంధించి ఓ విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సికింద్రాబాద్‌లోని ఎస్‌వీఐటీ సెంటర్‌లో చింతపల్లి చైతన్య కృష్ణ అనే విద్యార్థి తాను రాసిన జవాబులను వాట్సాప్‌ ద్వారా మిత్రులకు పంపించాడు. మొత్తం నలుగురు విద్యార్థులకు జవాబులు పంపించినట్లు పోలీసులు గుర్తించారు. వారంతా కూడా వివిధ సెంటర్లలో పరీక్ష రాస్తున్నవారే కావడం గమనార్హం. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

దేశంలోని 23 ఐఐటీల్లో వచ్చే విద్యా సంవత్సరం (2023-24) బీటెక్‌ సీట్ల భర్తీకి ఆదివారం జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష నిర్వహించారు. ఆన్‌లైన్‌ విధానంలో జరిపిన ఈ పరీక్షకు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 35 వేల మంది హాజరైవుంటారని అంచనా. ఈసారి కటాఫ్‌ మార్కులు సుమారు 60గా ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని