Smriti Irani: అమ్మాయిలూ!.. ఈ సందేశం మీకే!

సమాజాన్ని.. ముఖ్యంగా మహిళలను ప్రభావితం చేసే మెసేజ్‌లను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తుంటారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. తాజాగా అమ్మాయిల్లో స్ఫూర్తిరేకెత్తించే సందేశాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పోస్టు చేశారు. ‘‘ఆమెకు ఒక హీరో కావాలనిపించింది. దాంతో ఆమె హీరో అయ్యింది’’ అంటూ స్ఫూర్తి కోసం ఇతరులవైపు చూడాల్సిన అవసరం లేదని.. తమకి తామే హీరోలై.. ఇతరులకు ఆదర్శంగా నిలవచ్చన్నారు.

Published : 07 Sep 2021 01:19 IST

దిల్లీ: సమాజాన్ని.. ముఖ్యంగా మహిళలను ప్రభావితం చేసే సందేశాలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తుంటారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. తాజాగా అమ్మాయిల్లో స్ఫూర్తిరేకెత్తించే సందేశాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో ఉంచారు. ‘‘ఆమెకు ఒక హీరో కావాలి. దాంతో ఆమే హీరోగా మారింది ’’ అంటూ స్ఫూర్తి కోసం ఇతరులవైపు చూడాల్సిన అవసరం లేదని.. తమకి తామే హీరోలై.. ఇతరులకు ఆదర్శంగా నిలవొచ్చన్నారు.

రాజకీయ నేతల్లో ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండే వాళ్లలో స్మృతి ఒకరు. ప్రస్తుతం ఆమెను ఫాలో అయ్యేవారి సంఖ్య 1.1 మిలియన్ల మార్క్‌కు చేరుకుంది. ఆడవారి కట్టుబొట్టు ఉట్టిపడేలా వస్ర్తాధారణలో కనిపించే స్మృతి.. గతంలోనూ ఆడపిల్లల విద్య ప్రాముఖ్యతను వెల్లడిచేస్తూ ఓ వీడియోను నెట్టింట్లో పంచుకున్నారు. ‘మీ కుమార్తెలు స్వేచ్ఛగా ఎగిరేందుకు రెక్కలివ్వండి’ అంటూ వ్యాఖ్యను జోడించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని