Smriti Irani: అందుకే పన్ను చిట్లింది.. అహం దెబ్బతింది.. ఇరానీ ఇన్‌స్టా మాటలు విందామా..?
కేంద్రమంత్రి స్మృతి ఇరానీ నెట్టింట్లో సరదాగా ఉంటారు. అలాగే స్ఫూర్తి మాటలు చెప్తూ ఉంటారు. ఆ పోస్టుల్లో కొన్ని మీకోసం..
ఇంటర్నెట్ డెస్క్: స్మృతి ఇరానీ.. ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆమె టీవీ ఇండస్ట్రీలో ఎంత పాపులరో.. ఒక కేంద్రమంత్రిగా రాజకీయాల్లో అంతే డైనమిక్. ఇంత పని ఒత్తిడిలోనూ ఆమెలోని హాస్యచతురతకు ఏ మాత్రం లోటుండదు. ఒక పక్క తన ప్రపంచం గురించి సోషల్ మీడియాలో పరిచయం చేస్తూనే.. మరోపక్క చమత్కారాలు విసురుతుంటారు. అందులో కొన్ని స్ఫూర్తి మాటలు ఉంటాయి. ఈ ఏడాది ఆమె షేర్ చేసిన ఇన్‌స్టా పోస్టులపై ఓ లుక్కేద్దాం..!
ఈ ఏడాది మొదటి పోస్టుతోనే..
గత ఏడాది విధితో జరిగిన పోరాటంలో దంతం కొంచెం చిట్లింది, అహం కాస్త దెబ్బతింది. కొందరు ఆత్మీయులు దూరమయ్యారు. ముసుగులు తొలగిపోయాయి. అపోహలు చెదిరిపోయాయి. కొన్ని విజయాలు చెప్పకుండా మిగిలిపోయాయి. ఈ సమయంలో కొత్త సంవత్సరం కోసం ఎదురుచూస్తున్నాం. అందరికి సంతోషం, శ్రేయస్సు లభించాలని కోరుకుంటున్నాను.. అంటూ తన చిత్రాన్ని షేర్ చేశారు.
అందుకే ముందుకెళ్తున్నా..
నా చుట్టూ ఉన్న మంటల కంటే.. నాలో రగులుతున్న జ్వాలే ఎక్కువ ప్రకాశవంతంగా ఉంది. అందుకే నేనింకా మనుగడలో ఉన్నా.
ఇది నా కుటుంబం..
ప్రధాని మోదీ సహా భాజపా అగ్రనేతలున్న ఫొటోను షేర్ చేసి ‘ఇది నా కుటుంబం’ అని వ్యాఖ్యను జోడించారు.
పదా చూసుకుందాం..
ఇటీవల భారత్, పాక్ మధ్య జరిగిన ఒక మ్యాచ్ తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. చివర్లో హార్దిక్ పాండ్యా వీరోచిత ఇన్నింగ్స్ వల్ల చిరకాల ప్రత్యర్థిపై విజయం సాధించింది. మ్యాచ్ ఉత్కంఠగా సాగుతున్న వేళ 4 బంతులకు 6 పరుగులు కావాల్సిన సమయంలో కార్తిక్ సింగిల్ కోసం రమ్మని పిలిచాడు. కానీ ఏమాత్రం బెదరని పాండ్య ‘నేను చూసుకుంటా.. వదిలేయ్’ అన్నట్లు సైగ చేసి మరుసటి బంతికే సిక్స్ కొట్టాడు. దీనిని ఇరానీ సోమవారానికి ఆపాదించారు. ‘ఎవరైనా సోమవారం అని అంటే..’ ‘పదా చూసుకుందాం’ అనేలా హార్దిక్ వీడియోను ట్వీట్ చేశారు.
ఈ వారంలో ఇంకా ఎన్ని రోజులు..?
వారమంతా పనిచేసి, ఆదివారం కోసం ఎదురుచూస్తుంటాం. సెలవు రోజు ఎప్పుడు వస్తుందా అని చూస్తుంటాం. ఇరానీ షేర్ చేసిన వీడియోలో ఓ శునకం చెట్టును ఆసరాగా చేసుకొని, గోడకు ఆవలవైపు తొంగిచూసేందుకు ప్రయత్నిస్తోంది. దానిపై మంత్రి సరదాగా స్పందించారు. ‘ఇంకా ఈ వారంలో ఎన్ని రోజులున్నాయి..? చూడు’ అంటూ ఆమె దానికి వ్యాఖ్యను జోడించారు.
ట్రాఫిక్‌లో చిక్కుకున్నా..
స్మృతి ఇరానీ ట్రాఫిక్‌లో చిక్కుకున్నా ఖాళీగా కూర్చొని ఉండడానికి ఇష్టపడరు. మన చిన్న సరదాలతో ఎంజాయ్ చేయొచ్చని అల్లికల వీడియోను షేర్ చేశారు.
వయసు మీదపడిందనేగా..
క్రిస్మస్, కొత్త సంవత్సరం సందర్భంగా చాలామంది విహారయాత్రల్లో సేదతీరుతుంటారు. సెలవుల్లో టూర్లు ఎంజాయ్ చేయకుండా పని గురించి ఆలోచిస్తున్నామంటే.. వయసు మీదపడిందనేగా.. అంటూ ఒక స్టోర్‌లో సరుకులు కొనడానికి వెళ్లిన చిత్రాన్ని పంచుకున్నారు. అలాగే lifeofawife అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించారు. ఇంకా ఆమె తన కుటుంబం, రాజకీయం, బుల్లితెర ఆత్మీయుల గురించిన పలు విషయాలు కూడా నెటిజన్లతో షేర్ చేసుకుంటూ ఉంటారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
పసిపాప ఆకలి తీర్చేందుకు.. 10 కిలోమీటర్ల ప్రయాణం!
-
Crime News
vizag: విశాఖ రామజోగయ్యపేటలో కూలిన మూడు అంతస్తుల భవనం.. చిన్నారి మృతి
-
India News
కొంగ మీది బెంగతో.. యువరైతు కంటతడి
-
Sports News
హ్యాట్రిక్ డక్.. తొలి బంతికే.. వరుసగా విఫలమవుతున్న సూర్యకుమార్
-
World News
Prince Harry: ప్రిన్స్ హ్యారీకి అమెరికా ‘బహిష్కరణ’ ముప్పు..!
-
India News
Amritpal Singh: అరెస్టైనవారికి సాయం చేస్తాం: అకాలీదళ్