Smriti Irani: పోటీపడాలంటే.. అద్దంలో మిమల్ని మీరు చూడండి!

సామాజిక మాధ్యమాల వేదికగా కేంద్ర మంత్రి  స్మృతి ఇరానీ ఇచ్చే సందేశాలకు చాలా క్రేజ్‌ ఉంటుంది. స్ఫూర్తిదాయకం, ఫన్నీ, ఆలోజింపజేసే విషయాలను ఆమె నెటిజన్లతో పంచుకోవడమే అందుకు కారణం. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా స్మృతి చేసిన ఓ పోస్ట్‌ వైరల్‌గా మారింది.

Published : 10 Oct 2021 01:33 IST

 కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ

ఇంటర్నెట్‌ డెస్క్‌: సామాజిక మాధ్యమాల వేదికగా కేంద్ర మంత్రి  స్మృతి ఇరానీ ఇచ్చే సందేశాలు సందేశాత్మకంగా ఉంటాయి. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా స్మృతి చేసిన ఓ పోస్ట్‌ వైరల్‌గా మారింది. తన సెల్ఫీని కారు అద్దంలో బంధించి.. సందేశాన్ని ఇచ్చారామె. ‘‘పోటీకోసం ఎవరినో చూడాల్సిన పనిలేదు. మీకు మీరే పోటీగా భావించి ముందుకు దూసుకుపోవాలి. అదే మిమల్ని ప్రతిబింబిస్తుంది’’ అంటూ కామెంట్‌ పెట్టారు. రాజకీయ నేతల్లో  సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారిలో ఆమె ఒకరు. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో  ఆమెకు 11లక్షల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు.  గతంలోనూ ఆమె ఇచ్చిన పలు సందేశాలు అందరిని ఆకర్షించాయి ‘‘ఆమెకు ఒక హీరో కావాలి. దాంతో ఆమే హీరోగా మారింది ’’ అంటూ స్ఫూర్తి కోసం ఇతరులవైపు చూడాల్సిన అవసరం లేదని.. తమకి తామే హీరోలై.. ఇతరులకు ఆదర్శంగా నిలవొచ్చని అమ్మాయిలకు ఉద్దేశించి చెప్పారు.  ఆడపిల్లల విద్య ప్రాముఖ్యతను వివరిస్తూ.. ‘మీ కుమార్తెలు స్వేచ్ఛగా ఎగిరేందుకు రెక్కలివ్వండి’ అంటూ వ్యాఖ్యను జోడించిన వీడియో గతంలో ‘చిన్ని చిన్ని ఆశ.. చిన్నదాని ఆశ’ అంటూ ఓ చిన్నారి కోరుకుంటున్న విషయాన్ని బయటపెట్టారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని