కరోనాతో ఉద్యమనేత ఉసా కన్నుమూత

బడుగు, బలహీనవర్గాల ఉద్యమ నేత ఉప్పుటూరి సాంబశివరావు కరోనాతో మృతి చెందారు. బర్కత్‌పురాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు.

Published : 25 Jul 2020 14:26 IST

హైదరాబాద్‌: బడుగు, బలహీనవర్గాల ఉద్యమ నేత ఉప్పుటూరి సాంబశివరావు కరోనాతో మృతి చెందారు. బర్కత్‌పురాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. సామాజిక అణచివేత, వర్గ దోపిడీపై అయిదు దశాబ్దాలకు పైగా అలుపెరగని పోరాటం చేశారు. 

గుంటూరు జిల్లా బ్రాహ్మణ కోడూరులో జన్మించిన ఉప్పుటూరి సాంబశివరావు ఉసాగా సుపరిచితులు. విద్యార్థి దశనుంచే విప్లవ రాజకీయాల వైపు ఆకర్షితులయ్యారు. ప్రజాతంత్ర విద్యార్థి సంఘంలో పనిచేశారు. 1982లో నల్లగొండ జిల్లా మోత్కూరు ప్రాంతంలో రైతు ఉద్యమనేతగా పనిచేశారు. విద్యుత్‌ లోఓల్టేజీ సమస్యపై విశాల ఉ్యదమాన్ని నడపడంలో ఉసా ముందు నిలిచారు. యూసీసీఆర్‌ఐ ఎంఎల్‌ పార్టీ నుంచి బయటకు వచ్చి సామాజిక అణచివేత, వర్గపోరు సమస్యలపై దృష్టి సారించారు. ఆయా వర్గాల సమస్యలపై లోతుగా అధ్యయనం చేశారు. ఈ క్రమంలోనే ఉసాను ఉద్యమాల ఉపాధ్యాయుడిగా మార్చింది. విప్లవ, దళిత సామాజిక ఉద్యమాల మధ్య సమన్వయ సాధనలో దళిత బహుజన మేధావిగా ఉసా ఎదిగారు. కరోనా బారిన పడి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని