జమ్మూకశ్మీర్‌లో తెలుగు జవాను‌ మృతి

జమ్మూకశ్మీర్‌లో తెలుగు ఆర్మీజవాను‌ అమరుడయ్యాడు. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని పనపాకం పంచాయతీ గడ్డకిందపల్లికి....

Published : 03 Jan 2021 01:48 IST

చంద్రగిరి గ్రామీణం: జమ్మూకశ్మీర్‌లో తెలుగు ఆర్మీ జవాను‌ అమరుడయ్యాడు. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని పనపాకం పంచాయతీ గడ్డకిందపల్లికి చెందిన రెడ్డప్పనాయుడు(38) గత 14 ఏళ్లుగా భారత సైనిక దళంలో జవానుగా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే విధుల్లో భాగంగా సరిహద్దుల్లో శనివారం  పహారా కాస్తుండగా చలితీవ్రత ఎక్కువ కావడంతో అస్వస్థతకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో సహచర జవానులు గుర్తించి  సపర్యలు చేసి వెంటనే హెలికాప్టర్‌లో ఆర్మీ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే రెడ్డప్పనాయుడు మృతి చెందాడని ఆర్మీ వైద్యులు ధ్రువీకరించారు. అనంతరం ఈ విషయాన్ని జవాను కుటుంబీకులకు చేరవేశారు. రెడ్డప్ప నాయుడు మరణ వార్త తెలియడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు.  సంక్రాంతి పండక్కి సెలవుపై వస్తానన్న తన కుమారుడు విగత జీవిగా మారాడని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా  విలపిస్తున్నారు.  రెడ్డప్పకు భార్య రెడ్డమ్మ, కొడుకు, కుమార్తె ఉన్నారు. రెడ్డప్ప మరణవార్త తెలియడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రెడ్డప్ప భౌతికకాయాన్ని ఆర్మీ అధికారులు ఆదివారం స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఇవీ చదండి..

ఆలయాలపై దాడులు.. రాజకీయం చేయొద్దు!

ముంబయి పేలుళ్ల సూత్రధారి లఖ్వీ అరెస్టు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని