Andhrapradesh news: రూ.250 కోట్ల విలువవైన భూములు తిరిగి దేవాదాయ శాఖకు..

గుంటూరు జిల్లా కొరిటపాడు ప్రసన్నాంజనేయ స్వామి ఆలయానికి సంబంధించిన 16 ఎకరాల భూవివాదం కొలిక్కి వచ్చింది. ఈ భూమిని కౌలుకు తీసుకున్నవారు డబ్బులు చెల్లించకుండా కోర్టులకు వెళ్లారు.

Published : 04 May 2022 02:12 IST

 

గుంటూరు: గుంటూరు జిల్లా కొరిటిపాడు ప్రసన్నాంజనేయ స్వామి ఆలయానికి సంబంధించిన 16 ఎకరాల భూవివాదం కొలిక్కి వచ్చింది. ఈ భూమిని కౌలుకు తీసుకున్నవారు డబ్బులు చెల్లించకుండా కోర్టులకు వెళ్లారు. దీని వల్ల 2003లో వివాదం మొదలైంది.  కింది కోర్టుల్లో దేవాదాయశాఖకు అనుకూలంగా తీర్పు రావడంతో కౌలుదారులు హైకోర్టుని ఆశ్రయించారు. మార్చి 4వ తేదీన హైకోర్టులో కూడా వారి పిటిషన్ డిస్మిస్ అయ్యింది. దీంతో వెంటనే భూమిని ఖాళీ చేయాలని కౌలుదారులకు దేవాదాయశాఖాధికారులు నోటీసులు జారీ చేశారు. అందుకు అనుగుణంగా పొలాన్ని దేవాలయానికి అప్పగించారు. ‘ఈ భూమి విలువ సుమారు రూ.250 కోట్లు ఉంటుందని అంచనా. దాదాపు 25 ఏళ్ల పాటు ఈ భూమి ఇతరుల అనుభవంలో ఉంది. కేవలం దేవాదాయశాఖాధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగింది. బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. ఇప్పటి వరకు నష్టపోయిన ఆదాయాన్ని అధికారులతో కట్టించాలని’ బ్రాహ్మణ చైతన్య వేధిక అధ్యక్షుడు శ్రీధర్‌ డిమాండ్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని