Diwali 2021: దీపావళి.. టపాసులు కాల్చేటప్పుడు ఈ జాగ్రత్తలు మరవొద్దు!

దీపావళి వెలుగుల పండుగ. చిన్నాపెద్దా తేడా లేకుండా ఇంటిల్లిపాదీ ఆస్వాదించే వేడుక. అందరూ బాణసంచా కాల్చి ఆనందంగా జరుపుకొంటారు. .......

Published : 04 Nov 2021 01:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దీపావళి వెలుగుల పండుగ. చిన్నాపెద్దా తేడా లేకుండా ఇంటిల్లిపాదీ ఆస్వాదించే వేడుక. అందరూ బాణసంచా కాల్చి ఆనందంగా జరుపుకొంటారు. టపాసులు కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ముప్పే. ప్రమాదకరమైన బాణసంచా పేల్చడంతో ఆరోగ్యానికి చేటని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బాణసంచా నుంచి విడుదలయ్యే హానికరమైన రసాయనాలు ఊపిరితిత్తులు, కాలేయంపై దుష్ప్రభావం చూపుతాయంటున్నారు. పర్యావరణహితంగా దీపావళి జరుపుకొంటే మంచిదని సూచిస్తున్నారు.

టపాసులు కాల్చేటప్పుడు జాగ్రత్త..!
*
ప్రమాదకరమైన బాణసంచా జోలికి వెళ్లొద్దు. 
* శానిటైజర్‌ పూసుకొన్న చేతులతో టపాసులు కాల్చొద్దు. 
* బాణసంచాతో ప్రయోగాలు చేయకండి. పొగ ఎక్కువగా వచ్చే వాటిని వాడకండి. 
* టపాసులు కాల్చేటప్పుడు పిల్లల్ని దగ్గరగా తీసుకురావొద్దు. వాళ్లను ఇళ్లల్లోనే ఉండనివ్వాలి. 
* విద్యుత్‌ స్తంభాలు, వైర్లు వద్ద టపాసులు పేల్చొద్దు.
* నైలాన్‌ వస్త్రాలు ధరించి బాణసంచా కాల్చొద్దు. ఈ దుస్తులకు మంటలు త్వరగా అంటుకొనే స్వభావం ఉంటుంది. కాటన్‌ వస్త్రాలు మాత్రమే ధరించాలి.
* బాణసంచా కాల్చుతున్నప్పుడు ముఖం దగ్గరగా పెట్టొద్దు. 
* బకెట్‌తో నీళ్లు, ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌ దగ్గరగా పెట్టుకోవాలి. ఇంట్లో కాకుండా ఆరు బయట బాణసంచా కాల్చండి.
* డ్రైనేజీల వద్ద టపాసులు పేల్చకూడదు. వాటి నుంచి కొన్ని రకాల రసాయనాలు వెలువడే అవకాశం ఉంది. 
* మట్టితో తయారు చేసిన ప్రమిదలనే వాడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని