ఏపీలో పలువురు విశ్రాంత అధికారులు రాజీనామా

ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వ హయాంలో వివిధ హోదాల్లో నియమితులైన విశ్రాంత అధికారులు తమ పదవులకు రాజీనామాలు చేశారు. వారి రాజీనామాలను ఆమోదిస్తూ సీఎస్‌ నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Published : 24 Jun 2024 21:08 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వ హయాంలో వివిధ హోదాల్లో నియమితులైన విశ్రాంత అధికారులు తమ పదవులకు రాజీనామాలు చేశారు. వారి రాజీనామాలను ఆమోదిస్తూ సీఎస్‌ నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. రాజీనామాలు చేసిన విశ్రాంత అధికారుల్లో న్యాయశాఖ కార్యదర్శి సత్య ప్రభాకర్‌ రావు, విజిలెన్స్‌ కమిషనర్‌ వీణా ఇష్‌, పట్టణాభివృద్ధిశాఖ అదనపు కార్యదర్శి ఎం.ప్రతాప్‌ రెడ్డి, కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ వెంకటరమణారెడ్డి, అదనపు డైరెక్టర్‌ సుధాకర్‌, మెంబర్‌ కమిషనర్‌ మల్లికార్జున ఉన్నారు. వీరందరి రాజీనామాలను ఆమోదిస్తూ సీఎస్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని