Odisha Train Accident: నేడు, రేపు పలు రైళ్లు రద్దు
ఒడిశాలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ దుర్ఘటన నేపథ్యంలో సోమ, మంగళవారాల్లో పలు రైళ్లు రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.
సికింద్రాబాద్: ఒడిశాలోని బాలేశ్వర్ వద్ద ఘోర రైలు ప్రమాద(Odisha train accident) ఘటన నేపథ్యంలో రైల్వే శాఖ అధికారులు పలు రైళ్లు రద్దు చేశారు. బాలేశ్వర్ సమీపంలో ట్రాక్ పునరుద్ధరణ పనులు కొనసాగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఖరగ్‌పూర్-భద్రక్ మధ్యలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ దుర్ఘటన నేపథ్యంలో ఈ నెల 5, 6 తేదీల్లో షెడ్యూల్ చేసిన పలు రైళ్ల సేవలను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ నెల 5న పురూలియా-విల్లుపురం(22605); జూన్ 5, 6 తేదీల్లో ఎస్‌ఎంబీటీ బెంగళూరు-హావ్‌డా(12246); ఈ నెల 5న (12864) ఎస్‌ఎంబీటీ బెంగళూరు -హావ్‌డా రైళ్లను రద్దు చేస్తున్నట్టు పేర్కొంది.
ఈ ప్రమాదం నేపథ్యంలో ఈ రోజు చెన్నై సెంట్రల్ నుంచి హావ్‌డా వెళ్లాల్సిన రైలు(12840)ను అధికారులు రద్దు చేసిన విషయం తెలిసిందే. అలాగే, సికింద్రాబాద్-గువాహటి (12513) రైలును ఖరగ్‌పూర్, టాటా, రూర్కెలా, ఝార్సుగుడా మీదుగా డైవర్ట్ చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ ఓ ప్రకటనలో తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.