Shahi Tharoor: శశి థరూర్‌ సభకు డిక్షనరీతో వచ్చిన వ్యక్తి.. నెటిజన్ల రియాక్షన్ ఇదే!

 శశి థరూర్‌ (Shahi Tharoor)తో మాట్లాడేప్పుడు చేతిలో డిక్షనరీ (Dictionary) ఉండి తీరాల్సిందేనని నెటిజన్లు సరదాగా కామెంట్‌ చేస్తుంటారు. ఈ మాటను సీరియస్‌గా తీసుకున్న ఓ యువకుడు థరూర్‌ సమావేశానికి ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ (Oxford Dictionary)తో హాజరయ్యాడు.

Published : 28 Feb 2023 01:15 IST

కోహిమా: కాంగ్రెస్‌ (Congress) సీనియర్‌ నేత,తిరువనంతపురం ఎంపీ శశి థరూర్‌ (Shahi Tharoor) ఆంగ్ల పరిజ్ఞానం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరంలేదు. ట్విటర్‌తోపాటు, ప్రసంగించేప్పుడు ఆయన ఉపయోగించే ఆంగ్ల పదాలకు అర్థాలు తెలుసుకునేందుకు చాలా మంది నిఘంటువు (Dictionary)లో వెతుకుతుంటారు.  శశి థరూర్‌తో మాట్లాడేప్పుడు చేతిలో నిఘంటువు ఉండి తీరాల్సిందేనని నెటిజన్లు సరదాగా కామెంట్‌ చేస్తుంటారు. ఈ మాటను సీరియస్‌గా తీసుకున్న ఓ యువకుడు శశి థరూర్‌ సమావేశానికి నిజంగానే ఆక్స్‌ఫర్డ్‌ నిఘంటువు (Oxford Dictionary)తో హాజరయ్యాడు. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. అయితే, ఈ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం ఇందులో ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు.. థరూర్‌ ప్రసంగం అంటే ఆ మాత్రం ఉండాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

నాగాలాండ్‌ (Nagaland)కు చెందిన ఆర్‌. లుంగ్‌లెంగ్ (R Lungleng) అనే వ్యక్తి  ‘ది లుంగ్‌లెంగ్ షో’ (The LungLeng Show) పేరుతో రాజకీయ, సామాజిక అంశాలపై టాక్‌ షో నిర్వహింస్తుంటాడు. తాజాగా ఆయన టాక్‌ షోకు శశి థరూర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న ఓ వ్యక్తి తనతోపాటు ఆక్స్‌ఫర్డ్‌ నిఘంటువును తీసుకొచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను లుంగ్‌లెంగ్ ట్విటర్‌లో షేర్‌ చేస్తూ..‘‘శశి థరూర్‌ ప్రసంగం వినడానికి నాగాలాండ్‌లో ఓ వ్యక్తి నా షోకు ఆక్స్‌ఫర్డ్‌ నిఘంటువుని తీసుకొచ్చాడు. థరూర్‌ కార్యక్రమాలను నిఘంటువు తీసుకెళ్లాలనే నానుడి ఇప్పటిదాకా నేను ఓ జోక్‌ అనుకునేవాడిని. కానీ, ఈ వీడియో చూశాక.. అది నిజమని నమ్ముతున్నాను’’ అని ట్వీట్‌లో రాసుకొచ్చారు.

ఈ వీడియోపై శశి థరూర్‌ స్పందించారు. ‘‘సందర్భానుసారం మంచి హాస్యాన్ని నేను ఎప్పుడూ ఆస్వాదిస్తాను. లుంగ్‌లెంగ్‌ నా షోకు సంబంధించిన వీడియోను పోస్ట్‌ చేయండి. షోలో నేను ఉపయోగించిన పదాల్లో ఏవైనా మూడింటికి అర్థాలు నిఘంటువులో వెతకమని ప్రేక్షకులను ఛాలెంజ్‌ విసురుదాం’’ అని థరూర్‌ ట్వీట్ చేశారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు