Ear: చెవిలో ఏదైనా పడిందా..? ఇలా చేసి చూడండి

చెవిలో ఏదైనా పడితే ఆ శబ్దం అంతుచిక్కని నరకాన్ని చూపిస్తుంది. విపరీత శబ్దంతో పాటు నొప్పి కూడా భయంకరంగా ఉంటుంది. ఏ పని చేయలేం..ఎటూ పాలుపోదు. ఇక చిన్నారులైతే చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఏమవుతుందో తెలియక బాగా ఏడుస్తుంటారు.

Published : 13 Oct 2022 01:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చెవిలో ఏదైనా పడితే ఆ ఇబ్బంది తీవ్రంగా ఉంటుంది. ఒక్కోసారి భరించలేనంత నొప్పి కూడా వస్తుంది. ఏ పని చేయలేం. ఇక చిన్నారులైతే ఏమైందో తెలియక బాగా ఏడుస్తుంటారు.

చిన్నారులు చదువుతున్నప్పుడో.. రాస్తున్నపుడో పెన్ను, బలపం, పిన్నీసు లాంటి వాటిని ఏదో ఒకటి చెవిలో పెట్టుకుంటారు. ఆ సమయంలో పెన్ను మూతలు, బలపం ముక్కలు చెవిలో పడిపోతాయి. దాన్ని తీసే క్రమంలో కాస్త గట్టిగా అంటే లోపలికి వెళ్లే ప్రమాదం ఉంటుంది. పిల్లలు వాటిని గట్టిగా నెట్టినపుడు రక్తస్రావం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇక నిద్ర పోతున్న సమయంలో ఒక్కోసారి చీమలు, పురుగులు చెవిలోకి వెళ్తాయి. ఆ సమయంలో తీవ్రమైన నొప్పి, బాధ ఉంటుంది. దాన్ని తీయడానికి చేసే ప్రయత్నంలో చెవి లోపలి భాగం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ సమయంలో ఏం చేయాలో నిపుణులు పలు సూచనలు చేశారు.

* ఇలాంటి పరిస్థితుల్లో తలను సాధ్యమయినంత వరకు కిందికి వంచి ఉంచాలి. బలపం, పుల్లలు, పెన్సిల్‌, పెన్నుల మూతలు కనిపిస్తే జాగ్రత్తగా తీయడానికి వీలుంటేనే తీయాలి.

* చీమలు, పురుగులు చెవి లోపలికి వెళ్లి కదలాడుతుంటే రెండు చుక్కల ఆలీవ్‌ నూనె, బేబీ ఆయిల్‌ను గానీ పోయాలి. ఇలా చేయడంతో అవి చనిపోతాయి. వేరే వస్తువులుంటే మాత్రం ఆయిల్‌ పోయొద్దు. 

* చెవిలోపల ఏవైనా ఉంటే మాత్రం తీయకుండా వైద్యుల వద్దకు తీసుకెళ్లాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని