ఒకే కాన్పులో పదిమంది! 

దక్షిణాఫ్రికాకు చెందిన ఒక మహిళ ఒకే కాన్పులో 10 మంది శిశువులకు జన్మనిచ్చి ప్రపంచ రికార్డు సృష్టించింది.

Updated : 09 Jun 2021 15:53 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దక్షిణాఫ్రికాకు చెందిన ఒక మహిళ ఒకే కాన్పులో 10 మంది శిశువులకు జన్మనిచ్చి ప్రపంచ రికార్డు సృష్టించింది. గత నెలలో మొరాకోలోని తొమ్మిది మంది పిల్లలకు జన్మనిచ్చిన మాలియన్‌ హలీమా పేరు మీద ఉన్న రికార్డును బద్దలుకొట్టింది. దక్షిణాఫ్రికా, గౌటెంగ్‌కు చెందిన 37 ఏళ్ల గోసియామే తమరా సిథోల్‌ స్కానింగ్‌ చేయించుకోగా గర్భంలో ఎనిమిది మంది శిశువులు ఉన్నట్టు వైద్యులు తెలిపారు. కానీ సోమవారం రాత్రి కాన్పులో ఏడుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు మొత్తం 10 మంది శిశువులు జన్మించడం చూసి సిథోల్‌ కుటుంబం సంబరాల్లో మునిగిపోయింది. తన గర్భధారణ సహజమని ఎలాంటి సంతానోత్పత్తి చికిత్సలు చేయించుకోలేదనీ, ప్రసవ సమయానికి తనకు ఏడునెలల ఏడు రోజులు మాత్రమేనని సిథోల్‌ తెలిపారు. ఇప్పటికే సిథోల్‌కు ఆరేళ్ల వయసున్న కవల పిల్లలు ఉండటం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని