Asani Cyclone Effect: ‘అసని’ తపాను ప్రభావం.. పలు రైళ్లు రద్దు

బంగాళాఖాతంలో ‘అసని’ తుపాను కొనసాగుతోంది. దిశను మార్చుకున్న తుపాను కృష్ణా జిల్లా మచిలీపట్నం వైపు దూసుకొస్తోంది. ఈ నేపథ్యంలో తుపాను ప్రభావంతో దక్షిణ మధ్య రైల్వే...

Published : 11 May 2022 01:51 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బంగాళాఖాతంలో ‘అసని’ తుపాను కొనసాగుతోంది. దిశను మార్చుకున్న తుపాను కృష్ణా జిల్లా మచిలీపట్నం వైపు దూసుకొస్తోంది. ఈ నేపథ్యంలో తుపాను ప్రభావంతో దక్షిణ మధ్య రైల్వే బుధవారం పలు రైళ్లను రద్దు చేసింది. కొన్నింటిని రీషెడ్యూల్‌ చేసింది. మొత్తం 37 రైళ్లు రద్దయ్యాయి. వీటిలో విజయవాడ- మచిలీపట్నం, మచిలీపట్నం- విజయవాడ, విజయవాడ- నర్సాపూర్‌, నర్సాపూర్‌- నిడదవోలు, నిడదవోలు-నర్సాపూర్‌, నర్సాపూర్‌- విజయవాడ, విజయవాడ-నర్సాపూర్‌, నిడదవోలు-భీమవరం జంక్షన్‌, భీమవరం జంక్షన్‌-నిడదవోలు, మచిలీపట్నం-గుడివాడ, భీమవరం జంక్షన్‌- మచిలీపట్నం, గుడివాడ- మచిలీపట్నం, నర్సాపూర్‌-గుంటూర్‌, గుంటూర్‌-నర్సాపూర్‌, కాకినాడ పోర్ట్‌- విజయవాడ రైళ్లు ఉన్నాయి. నర్సాపూర్‌- నాగర్‌సోల్‌ రైలును రీషెడ్యూల్‌ చేశారు. నర్సాపూర్‌ నుంచి బుధవారం 11.05 గంటలకు బయలుదేరాల్సిన  రైలు మధ్యాహ్నం 2.05 గంటలకు వెళ్లనుంది. రెండు రైళ్లను దారి మళ్లించారు. వీటిలో బిలాస్‌పూర్‌- తిరుపతి, కాకినాడ పోర్ట్‌-చెంగల్‌పట్టు రైళ్లు ఉన్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని