
Updated : 24 Jan 2022 14:25 IST
SCR: ప్యాసింజర్ రైళ్ల రద్దును పొడిగించిన దక్షిణ మధ్య రైల్వే
హైదరాబాద్: కరోనా ఉద్ధృతి నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే 55 ప్యాసింజర్ రైళ్లను ఇవాళ్టి వరకు రద్దు చేసిన విషయం తెలిసిందే. కొవిడ్ వ్యాప్తి ఇంకా తగ్గని కారణంగా రైళ్ల రద్దును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో వెల్లడించింది.
Tags :