Summer Special Trains: మే-జూన్‌లో వేసవి ప్రత్యేక రైళ్లు ఇవే..

వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఇప్పటికే పలు స్టేషన్ల .....

Published : 22 May 2022 01:43 IST

హైదరాబాద్‌: వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఇప్పటికే పలు స్టేషన్ల మధ్య ప్రత్యేక సర్వీసులను నడుపుతుండగా.. మే, జూన్‌ మాసాల్లో నడిపే రైళ్ల జాబితాను తాజాగా విడుదల చేసింది. సికింద్రాబాద్‌, చిత్తూరు, హైదరాబాద్‌, తిరుపతి, బెంగళూరు కంటోన్మెంట్‌, ఎర్నాకుళం, చెన్నై, మదురై, శ్రీకాకుళం, రామేశ్వరం, గోరఖ్‌పూర్‌, జైపూర్‌, విశాఖ, కటక్‌ నుంచి పలు ప్రాంతాల నుంచి నేటి నుంచి నడపబోయే ప్రత్యేక రైలు సర్వీసుల వివరాలను ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. 

ఖాజీపేట నుంచి దాదర్‌కు 22 ప్రత్యేక రైళ్లు..
 ఖాజీపేట నుంచి దాదర్‌కు 22 వేసవి ప్రత్యేక వీక్లీ రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఆయా రైళ్లు నడిచే తేదీలు, వేళలు, ఆగే ప్రదేశాలు వంటి వివరాలను దక్షిణ మధ్య రైల్వే ముఖ్య పౌర సంబంధాల అధికారి సీహెచ్‌.రాకేశ్‌ విడుదల చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని