Pushpa South Central Railway: పుష్ప.. పుష్పరాజ్‌.. ‘రైల్వే ట్రాకులపై నడిచేదేలే’..!

కొవిడ్‌ నిబంధనలు, ట్రాఫిక్‌ ఉల్లంఘనలు వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ మధ్య ప్రభుత్వ అధికారులు కొత్త ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు.

Updated : 05 Feb 2022 17:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొవిడ్‌ నిబంధనలు, ట్రాఫిక్‌ ఉల్లంఘనలు వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ మధ్య ప్రభుత్వ అధికారులు కొత్త ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. సినిమాల్లోని ఫేమస్‌ డైలాగ్స్‌నే ప్రచార అస్త్రంగా మారిస్తే జనాలకు ఎక్కువగా చేరుతుందనే ఉద్దేశంతో సోషల్‌మీడియాలో పోస్టులు చేస్తున్నారు. గతంలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కరోనా నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అల్లు అర్జున్‌- సుకుమార్‌ కలయికలో వచ్చిన పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప’లోని డైలాగ్‌ను ఉపయోగించారు. (డెల్టా హో యా ఒమిక్రాన్.. మై మాస్క్‌ ఉతారేగా  నహీ) ‘‘డెల్టా అయినా ఒమిక్రాన్‌ అయినా.. మాస్క్‌ తీసేదేలే’’ అని రాశారు. తాజాగా  దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ‘‘తగ్గేదేలే’’ డైలాగ్‌తో ఓ మీమ్‌ను క్రియేట్‌ చేసింది. మై రైల్వే ట్రాక్‌ ట్రెస్‌పాస్‌ కరేగా నహీ  ‘‘రైలు పట్టాలు/ట్రాక్‌లపై నడిచేదేలే’’ అని అల్లు అర్జున్‌ పోస్టర్‌ రాసి దక్షిణ మధ్య రైల్వే  అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ‘‘ ప్రయాణికుల భద్రతే మాకు ముఖ్యం. రైలు పట్టాలపై నడవడం కానీ దాటడం కానీ చేయొద్దు. FOB (ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి) లేదా సబ్‌వేలను ఉపయోగించండి’ అని క్యాప్షన్‌ జతచేసింది. పలు ప్రభుత్వ శాఖల వరకే ‘పుష్ప’ క్రేజ్‌ ఆగిపోవట్లేదు. రాజకీయాల్లోకీ ‘పుష్ప’ జోరు కనిపిస్తోంది. ఉత్తర్‌ ప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ.. ‘‘చూపే బంగారమాయేనే శ్రీవల్లి..’’ పాటని కాస్తా ‘‘తూ హై గజాబ్‌ యూ, యూపీ; తేరీ కసమ్‌, యూపీ(చాలా అందంగా ఉంటావు, యూపీ..) అంటూ వీడియో సాంగ్‌ను రూపొందించింది. రాష్ట్రం గొప్పతనాన్ని వివరిస్తూ రాసిన  వీడియో సాంగ్‌ను బుధవారం యూపీ కాంగ్రెస్‌ శాఖ తమ ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని