SCR: తెలుగు రాష్ట్రాలకు రూ. 10,080 కోట్ల కేటాయింపు: ద.మ. రైల్వే జీఎం సంజీవ్‌ కిశోర్

తెలుగు రాష్ట్రాలకు బడ్జెట్‌లో రూ. 10,080 కోట్లు కేటాయించినట్లు దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజీవ్‌ కిశోర్‌ తెలిపారు. బడ్జెట్‌లో దక్షిణ మధ్య రైల్వేకు, తెలుగు రాష్ట్రాలకు

Updated : 03 Feb 2022 17:32 IST

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాలకు బడ్జెట్‌లో రూ. 10,080 కోట్లు కేటాయించినట్లు దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజీవ్‌ కిశోర్‌ తెలిపారు. బడ్జెట్‌లో దక్షిణ మధ్య రైల్వేకు, తెలుగు రాష్ట్రాలకు కేటాయింపు వివరాలను వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రానికి రూ. 3,048 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ. 7,032 కోట్లు కేటాయింపులు జరిపినట్లు వివరించారు. కొత్త లైన్లు, డబుల్ లైన్లు, మూడో లైన్, ఎలక్ట్రిఫికేషన్‌కు రూ. 9,125 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. బడ్జెట్‌లో కొత్త లైన్ల కోసమే రూ. 2,817 కోట్లను కేంద్ర ఆర్థిక శాఖ కేటాయించిందని తెలిపారు. 

నడికుడి-శ్రీకాళహస్తి కొత్త లైన్‌కు రూ. 1,051 కోట్లు, కోటిపల్లి-నర్సాపూర్ నూతన లైన్‌కు రూ. 358 కోట్లు, మునీరాబాద్‌-మహబూబ్‌నగర్‌ కొత్త లైన్‌కు రూ. 289 కోట్లు, కడప-బెంగళూరు కొత్త లైన్‌కు రూ. 289 కోట్లు, భద్రాచలం-సత్తుపల్లి కొత్త లైన్‌కు రూ. 163 కోట్లు, మనోహరాబాద్‌-కొత్తపల్లి నూతన లైన్‌కు రూ. 160 కోట్లు, అక్కన్నపేట్‌-మెదక్‌ కొత్త లైన్‌కు రూ. 41 కోట్లను కేటాయించినట్లు దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజీవ్ కిశోర్‌ వెల్లడించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని